టీ20 ప్రపంచకప్‌లో అజేయంగా దూసుకెళ్తున్న భారత జట్టు.. శనివారం(జూన్ 22) మరో కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. అంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ శాంటో.. భారత జట్టును మొదట బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ కీలక పోరులో భారత జట్టులో ఎలాంటి మార్పులు లేకపోగా.. బంగ్లా ఒక మార్పు చేసింది. తస్కిన్ అహ్మద్ స్థానంలో మెహదీ హసన్ జట్టులోకి వచ్చాడు.
సూపర్ 8 దశను విజయంతో ఆరంభించిన టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే సెమీస్ బెర్త్ ఖరారైనట్టే. కాగా, ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. తొలుత బ్యాటింగ్ చేసినా, ఛేదనలో అయినా తొలి వికెట్‌కు 100కు పైగా భాగస్వామ్యం నెలకొల్పుతారని వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా అభిప్రాయపడ్డారు. ఆ మాటను మన భారత ద్వయం నిలబెడతారా..! లేదా..! అనేది కాసేపట్లో తేలనుంది.
తుది జట్లు
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.
బంగ్లాదేశ్: తాంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), షకీబ్ అల్ హసన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, రిషాద్ హొస్సేన్, మహేదీ హసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తంజిమ్ షకీబ్.