అంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాటర్లు వికెట్లు చేజార్చుకుంటున్నారు. 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోయి 71 పరుగులతో పటిష్టంగా ఉన్న భారత జట్టు.. తంజిమ్ హసన్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. కోహ్లీ, సూర్య ఇద్దరూ బంతి తేడాతో పెవిలియన్ చేరారు.
ఈ మ్యాచ్‌లో మంచి టచ్ లో కనిపించిన కోహ్లీ(37; 28 బంతుల్లో) అనవసరపు షాట్‌కు యత్నించి వికెట్ పారేసుకున్నాడు. తంజిమ్ హసన్ వేసిన తొమ్మిదో ఓవర్ తొలి బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అనంతరం బంతి తేడాతో సూర్య కుమార్(6) అతని వెంటే పెవిలియన్ చేరాడు. ఎదుర్కొన్న తొలి బంతిని సిక్స్‌గా మలిచిన సూర్య.. ఆ మరుసటి బంతిని వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు. దాంతో, టీమిండియా 77 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.
Two wickets in an over for Tanzim Hasan Sakib 😲
— CricTracker (@Cricketracker) June 22, 2024
Follow for live scores - https://t.co/bAuLswVAw2 pic.twitter.com/RvSwMtEU5O
రోహిత్ మెరుపులు
అంతకుముందు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(23) కాసేపు మెరుపులు పెరిపించాడు. అలాగే, ధాటిగా ఆడే ప్రయత్నంలో జాకర్ అలీ చేతికి చిక్కాడు. షకీబుల్ హసన్ వేసిన మూడో ఓవర్ లో సిక్స్, ఫోర్ బాదిన హిట్‌మ్యాన్ నాలుగో బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం రిషభ్ పంత్ (15), శివమ్ దూబె (2) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 10 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్.. 83/3.
Not the Virat Kohli we are used to seeing 😳 #T20WorldCup | #INDvBAN pic.twitter.com/duKRxdyqM0
— ESPNcricinfo (@ESPNcricinfo) June 22, 2024