వరుస విజయాలతో దూకుడుమీదన్న భారత జట్టుకు.. బంగ్లా ఆటగాళ్లు షాకిచ్చిన విషయం తెలిసిందే. ఆసియా కప్ ఫైనల్ ముందు బలమైన భారత జట్టును ఓడించి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టారు. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించారు. ఈ మ్యాచ్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ కావడం ద్వారా అరుదైన చెత్త రికార్డును తన ఖాతాలో వేసుసుకున్నాడు.
266 పరుగుల లక్ష్య ఛేదనలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తొలి ఓవర్ లోనే వెనుదిరిగాడు. బంగ్లా అరంగేట్ర బౌలర్ తంజీమ్ హసన్ వేసిన మొదటి బంతిని డిఫెన్స్ ఆడిన రోహిత్.. రెండో బంతికి క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో రోహిత్.. ఆసియా వన్డే కప్ చరిత్రలో అత్యధిక సార్లు (3) డకౌట్ అయిన తొలి భారత ఆటగాడిగా చెత్త రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. అంతేకాదు.. ఈ టోర్నీ చరిత్రలో పరుగుల ఖాతా తెరవకుండానే 3 సార్లు ఔట్ అయిన ఐదో క్రికెటర్‍గానూ చోటు సంపాదించాడు.
Also Read :- Asia Cup 2023: పోరాడినవాడే గాయపడ్డాడు.. ఫైనల్ మ్యాచ్‌కు భారత ఆల్‌రౌండర్ దూరం
వన్డే ఫార్మాట్‍లో రోహిత్ శర్మ డకౌట్ కావడం ఇది 15వ సారి కూడాను. ఒక్క డకౌట్ ఎన్ని రికార్డులకు కారణమైందో చూశారుగా! దీంతో నెటిజెన్స్ రోహిత్ శర్మను ఆడుకుంటున్నారు. డకౌట్లలో రికార్డ్ ఏంటి కెప్టెన్ అంటూ పెదవి విరుస్తున్నారు.
A 2-ball Duck For Rohit Sharma against Bangladesh!
— CRICKETNMORE (@cricketnmore) September 15, 2023
? - Disney + Hotstar#INDvBAN #AsiaCup pic.twitter.com/GUdzAhLVHv
ఆసియా వన్డే కప్ చరిత్రలో ఎక్కువ సార్లు డకౌట్ అయిన క్రికెటర్లు
- రూబెల్ హసన్ (బంగ్లాదేశ్): 3 సార్లు
- సల్మాన్ భట్ (పాకిస్తాన్): 3 సార్లు
- అమీనుల్ ఇస్తాం (బంగ్లాదేశ్): 3 సార్లు
- మహేళ జయవర్ధనే (శ్రీలంక): 3 సార్లు
- రోహిత్ శర్మ (భారత్): 3 సార్లు