క్లీన్‌‌‌‌‌‌‌‌స్వీప్‌‌‌‌‌‌‌‌పై ఇండియా గురి.. ఇవాళ్టి నుంచి బంగ్లాదేశ్తో రెండో టెస్ట్

క్లీన్‌‌‌‌‌‌‌‌స్వీప్‌‌‌‌‌‌‌‌పై ఇండియా గురి.. ఇవాళ్టి నుంచి బంగ్లాదేశ్తో రెండో టెస్ట్
  • కోహ్లీ, రోహిత్‌‌‌‌‌‌‌‌పై స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఫోకస్‌‌‌‌‌‌‌‌
  • మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు వర్షం ముప్పు
  • ఉ. 9.30 నుంచి స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌–18లో లైవ్‌‌‌‌‌‌‌‌

కాన్పూర్‌‌‌‌‌‌‌‌: తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌లో భారీ విజయంతో జోరుమీదున్న టీమిండియా.. బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌తో రెండో మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు రెడీ అయ్యింది. నేటి నుంచి జరిగే ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనూ గెలిచి సిరీస్‌‌‌‌‌‌‌‌ను క్లీన్‌‌‌‌‌‌‌‌స్వీప్‌‌‌‌‌‌‌‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ లక్ష్యం నెరవేరాలంటే స్టార్ బ్యాటర్లు రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ, విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ బ్యాట్లు ఝుళిపించాలి. తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఫెయిలైన ఈ ఇద్దరు ఈ పోరుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సుదీర్ఘమైన టెస్ట్‌‌‌‌‌‌‌‌ సీజన్‌‌‌‌‌‌‌‌ ముందుండటంతో ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ నుంచే గాడిలో పడాలని భావిస్తున్నారు. ఇక తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌ ఓటమితో కుదేలైన బంగ్లా కూడా ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ కోసం కొత్తగా సిద్ధమైంది. అందుబాటులో ఉన్న ప్లేయర్లతోనే గట్టి పోటీ ఇవ్వాలని ప్రణాళికలు రచిస్తోంది. అయితే రెండు జట్ల కల నెరవేరాలంటే వాన దేవుడు కరుణించాలి. తొలి, మూడో రోజు కాన్పూర్‌‌‌‌‌‌‌‌లో భారీ వర్షం కురిసే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 

మూడో స్పిన్నర్‌‌‌‌‌‌‌‌గా కుల్దీప్‌‌‌‌‌‌‌‌!

చెన్నై పిచ్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే కాన్పూర్‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌ చాలా భిన్నంగా ఉంది. నల్ల మట్టితో రూపొందించిన ఈ పిచ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ జరిగే కొద్దీ  స్లోగా మారుతుంది. అలాగే లో బౌన్స్‌‌‌‌‌‌‌‌కు అనుకూలిస్తుంది. ఇక వర్షం వల్ల వికెట్‌‌‌‌‌‌‌‌లోనూ మార్పులు వచ్చే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉండటం, మూడో సెషన్‌‌‌‌‌‌‌‌లో బ్యాడ్‌‌‌‌‌‌‌‌లైట్‌‌‌‌‌‌‌‌ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముగ్గురు పేసర్లకు బదులుగా ముగ్గురు స్పిన్నర్లను తుది జట్టులోకి తీసుకోవాలని టీమిండియా మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ భావిస్తోంది. అదే జరిగితే ఆకాశ్‌‌‌‌‌‌‌‌ దీప్‌‌‌‌‌‌‌‌  బెంచ్‌‌‌‌‌‌‌‌కు పరిమితమై.. కుల్దీప్‌‌‌‌‌‌‌‌, అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌లో ఒకరు తుది జట్టులోకి రావొచ్చు. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుంటే అక్షర్‌‌‌‌‌‌‌‌కే ఎక్కువ చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది. స్పిన్నర్లు అశ్విన్‌‌‌‌‌‌‌‌, జడేజా, పేసర్లుగా బుమ్రా, సిరాజ్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లు ఖాయం. చివరిసారి 2021లో ఇదే వేదికపై న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌తో జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ముగ్గురు స్పిన్నర్లను బరిలోకి దించారు. ఆ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ డ్రా అయ్యింది. 2016లోనూ కివీస్‌‌‌‌‌‌‌‌తోనే జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనూ ఇదే ఫలితం వచ్చింది. ఇక బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో గిల్‌‌‌‌‌‌‌‌, పంత్‌‌‌‌‌‌‌‌, జైస్వాల్‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉండటం కలిసొచ్చే అంశం. అయితే రాహుల్‌‌‌‌‌‌‌‌ కూడా గాడిలో పడాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా తుది జట్టులో పెద్ద మార్పులు లేకపోయినా బ్యాటర్లు గాడిలో పడితే విజయం ఖాయం. 

తైజుల్‌‌‌‌‌‌‌‌ ఇస్లామ్‌‌‌‌‌‌‌‌కు చోటు..

ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌పై కూడా బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అయితే వేలి గాయంతో బాధపడుతున్న ఆల్‌‌‌‌‌‌‌‌రౌండ్‌‌‌‌‌‌‌‌ షకీబ్‌‌‌‌‌‌‌‌ ఆడటంపై స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై టీమ్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లోనే భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చెన్నై టెస్ట్‌‌‌‌‌‌‌‌లో ఫెయిలైన బ్యాటర్లు ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో రాణించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ శాంటో మినహా మిగతా వారందరూ ఇండియా పేస్‌‌‌‌‌‌‌‌–స్పిన్‌‌‌‌‌‌‌‌ను దీటుగా ఎదుర్కోవడంపై దృష్టి పెట్టారు. బంగ్లా కూడా మూడో స్పిన్నర్‌‌‌‌‌‌‌‌గా తైజుల్‌‌‌‌‌‌‌‌ ఇస్లామ్‌‌‌‌‌‌‌‌కు చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వనుంది. నహీద్‌‌‌‌‌‌‌‌ రాణా ప్లేస్‌‌‌‌‌‌‌‌లో అతన్ని తీసుకురావాలని యోచిస్తోంది. అయితే ఆఫ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ నయీమ్‌‌‌‌‌‌‌‌ హసన్‌‌‌‌‌‌‌‌ కూడా లైన్‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నాడు. మొత్తానికి ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో గెలవాలంటే బంగ్లా శక్తికి మించి  శ్రమించాలి. 

జట్లు (అంచనా)

ఇండియా: రోహిత్‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌, శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌, విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ, రిషబ్‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌, కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌, జడేజా, అశ్విన్‌‌‌‌‌‌‌‌, కుల్దీప్‌‌‌‌‌‌‌‌ / అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌, బుమ్రా, సిరాజ్‌‌‌‌‌‌‌‌. 
బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌: నజ్ముల్‌‌‌‌‌‌‌‌ శాంటో (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), షాద్మాన్‌‌‌‌‌‌‌‌ ఇస్లామ్‌‌‌‌‌‌‌‌, జాకిర్‌‌‌‌‌‌‌‌ హసన్‌‌‌‌‌‌‌‌, మోమినల్‌‌‌‌‌‌‌‌ హక్‌‌‌‌‌‌‌‌, ముష్ఫికర్‌‌‌‌‌‌‌‌ రహీమ్‌‌‌‌‌‌‌‌, షకీబ్‌‌‌‌‌‌‌‌, లిటన్‌‌‌‌‌‌‌‌ దాస్‌‌‌‌‌‌‌‌, మెహిదీ హసన్‌‌‌‌‌‌‌‌ మిరాజ్‌‌‌‌‌‌‌‌, తైజుల్‌‌‌‌‌‌‌‌ ఇస్లామ్‌‌‌‌‌‌‌‌, హసన్‌‌‌‌‌‌‌‌ మహ్మూద్‌‌‌‌‌‌‌‌, తస్కిన్‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌. 

 

  • 1ఒక్క వికెట్‌‌‌‌‌‌‌‌ తీస్తే జడేజా 300 క్లబ్‌‌‌‌‌‌‌‌లో చేరతాడు. ఇండియా తరఫున ఈ ఫీట్‌‌‌‌‌‌‌‌ సాధించిన ఏడో బౌలర్‌‌‌‌‌‌‌‌గా నిలుస్తాడు. ఇప్పటికే 3 వేల రన్స్‌‌‌‌‌‌‌‌ పూర్తి చేసిన జడ్డూ 300 వికెట్ల క్లబ్‌‌‌‌‌‌‌‌లో చేరితే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌‌‌‌‌‌‌‌గా (74 టెస్ట్‌‌‌‌‌‌‌‌లు) రికార్డులకెక్కుతాడు. ఇయాన్‌‌‌‌‌‌‌‌ బోథమ్‌‌‌‌‌‌‌‌ (72) ముందున్నాడు. 
  • 1299 వేల రన్స్‌‌‌‌‌‌‌‌ క్లబ్‌‌‌‌‌‌‌‌ చేరడానికి కోహ్లీ చేయాల్సిన పరుగులు. 
  • 5 రెండు వందల వికెట్ల క్లబ్‌‌‌‌‌‌‌‌లో చేరడానికి తైజుల్‌‌‌‌‌‌‌‌కు అవసరమైన వికెట్లు. షకీబ్‌‌‌‌‌‌‌‌ (242) తర్వాత ఈ ఫీట్‌‌‌‌‌‌‌‌ సాధించిన రెండో బౌలర్‌‌‌‌‌‌‌‌గా నిలుస్తాడు.