
గ్వాలియర్: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా ఇప్పుడు టీ20 సిరీస్‌లోనూ అదే ఫలితాన్ని రాబట్టాలని చూస్తోంది. ఇందుకోసం ముమ్మర ప్రాక్టీస్ చేస్తోంది. ఆదివారం గ్వాలియర్ వేదికగా జరిగే తొలి టీ20 ముంగిట సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని జట్టు ఫీల్డింగ్‌పై ఫోకస్ పెట్టింది. ఇక్కడి ఎంపీసీఏ స్టేడియంలో శుక్రవారం ఆటగాళ్లతో ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ ప్రత్యేక డ్రిల్స్ చేయించాడు. కెప్టెన్ సూర్య, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు పలువురు యంగ్ క్రికెటర్లు అద్భుతమైన క్యాచ్‌లు అందుకుంటూ కనిపించారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ దష్కటే ఈ సెషన్‌ను పర్యవేక్షించారు. ఈ నెల 9, 12వ తేదీల్లో ఢిల్లీ, హైదరాబాద్‌లో చివరి రెండు మ్యాచ్‌లు జరుగుతాయి.