ఐదు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌లో నాలుగో టీ20కి సమయం వచ్చేసింది. శనివారం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టీ20 జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ సారథి జోస్ బట్లర్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. టీమిండియాను తక్కువ పరుగులకు కట్టడి చేసి.. లక్ష్యాన్ని చేధించాలనేది ఇంగ్లీష్ జట్టు వ్యూహం.
ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ మార్పులు చేపట్టింది. ఏకంగా మూడు మార్పలు చేసింది. షమీ స్థానంలో అర్ష్‌దీప్, జురెల్ స్థానంలో రింకూ, వాషింగ్టన్ సుందర్ స్థానంలో శివమ్ దూబే జట్టులోకి వచ్చారు. ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో కొనసాగుతోన్న టీమిండియాకు సిరీస్ సొంతం చేసుకోవడానికి ఒకే ఒక్క విజయం అవసరం. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ సొంతమైనట్టే.
ఇరు జట్లలోనూ భారీ హిట్టర్లు ఉండటంతో హైస్కోరింగ్ పోరు తప్పకపోవచ్చు. అందునా, పుణె పిచ్.. బ్యాటర్ల స్వర్గధామం. 190 పైచిలుకు పరుగులు నమోదు అవ్వవచ్చని అంచనా.
Also Read :- ఇది కదా క్రేజ్.. జూన్‌లో జరగాల్సిన టెస్టులకు టికెట్స్ సోల్డ్ ఔట్
మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్‌స్టార్‌లో వీక్షించొచ్చు. కావున మీ టీవీలు ఆన్ చేసేయండి.
తుది జట్లు
ఇండియా: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లండ్: ఫిల్ సాల్ట్(వికెట్ కీపర్), బెన్ డకెట్, జోస్ బట్లర్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్.
🚨 Toss News 🚨
— BCCI (@BCCI) January 31, 2025
England elected to bowl against #TeamIndia in the 4⃣th #INDvENG T20I.
Follow The Match ▶️ https://t.co/pUkyQwxOA3 @IDFCFIRSTBank pic.twitter.com/zNb7tgi1cL