IND vs END 5th T20I: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. భారత జట్టులో ఏకైక మార్పు

IND vs END 5th T20I: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. భారత జట్టులో ఏకైక మార్పు

ఆఖరి టీ20కి వేళాయె.. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఆదివారం(ఫిబ్రవరి 02) వాంఖడే వేదికగా ఐదో టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్ సారథి జోస్ బట్లర్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. టీమిండియాను తక్కువ పరుగులకు కట్టడి చేసి.. లక్ష్యాన్ని చేధించాలనేది ఇంగ్లీష్ జట్టు వ్యూహం.  

ఈ మ్యాచ్‌లో టీమిండియా ఏకైక మార్పుతో బరిలోకి దిగుతోంది. అర్షదీప్ స్థానంలో షమీ జట్టులోకి వచ్చాడు. మరోవైపు, ఇంగ్లండ్ సాకిద్ మహమ్మద్ స్థానంలో మార్క్ వుడ్‌ను దించింది. ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. చివరి టీ20లోనూ విజయం సాధించగలమనే ధీమాతో ఉంది.

మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్‌స్టార్‌లో వీక్షించొచ్చు. కావున మీ టీవీలు ఆన్ చేసేయండి. 

తుది జట్లు

ఇండియా: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీ, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.

ఇంగ్లండ్: ఫిల్ సాల్ట్(వికెట్ కీపర్), బెన్ డకెట్, జోస్ బట్లర్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.