ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టీ20లో ఇంగ్లాండ్ 132 పరుగులకే కుప్పకూలింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లు భారత బౌలర్ల దాటికి తాళలేక పెవిలియన్ కు క్యూ కట్టారు. ఇంగ్లీష్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్ (68; 44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడు ఒంటరి పోరాటం చేశాడు.
ALSO READ | IND vs ENG: చాహల్ రికార్డ్ బద్దలు.. టీమిండియా టాప్ బౌలర్‌గా అర్షదీప్ సింగ్
బట్లర్ తరువాత హ్యారీ బ్రూక్ (17), జోఫ్రా ఆర్చర్ (12) మాత్రమే రెండెంకెల స్కోర్ చేయగలిగారు. మిగిలిన బ్యాటర్లంతా విఫలం. టెస్టుల్లో ఈమధ్య సెంచరీల మీద సెంచరీలు బాదిన హ్యారీ బ్రూక్ 12 పరుగులకే ఔటవ్వడం ఇంగ్లాండ్‌ను బాగా దెబ్బతీసింది. ఇక గంపెడాశలు పెట్టుకున్న ఫిల్ సాల్ట్(0), లివింగ్‌స్టోన్(0) ఇద్దరు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరడం ఇంగ్లీష్ జట్టుకు మరో దెబ్బ. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
Varun Chakravarthy was on top of his game once again as England just failed to get going at the Eden Gardens https://t.co/O05YBdVrNp | #INDvENG pic.twitter.com/Vz1UE0C03O
— ESPNcricinfo (@ESPNcricinfo) January 22, 2025