IND vs ENG: 4, 4, 0, 6, 4, 4.. అట్కిన్సన్‌ను ఉతికారేసిన శాంసన్

IND vs ENG: 4, 4, 0, 6, 4, 4.. అట్కిన్సన్‌ను ఉతికారేసిన శాంసన్

ఈడెన్‌ గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టీ20లో భారత వికెట్ కీపర్ సంజూ శాంసన్ రెచ్చిపోయాడు. తొలి ఓవర్ ఆచి తూచి ఆడిన సంజూ.. రెండో ఓవర్‌లో విశ్వరూపం చూపెట్టాడు. ఇంగ్లీష్ పేసర్ గస్ అట్కిన్సన్‌ వేసిన ఆ ఓవర్‌లో ఏకంగా 22 పరుగులు రాబట్టాడు. వరుసగా 4,4,0,6,4,4 బాదాడు. దాంతో, టీమిండియా రెండు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. 

ALSO READ | IND vs ENG 1st T20I: చుట్టేసిన భారత బౌలర్లు.. ఇంగ్లాండ్ 132 ఆలౌట్

అంతకుముందు భారత బౌలర్లు విజృంభించడంతో ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 132 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లీష్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్ (68; 44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్. మరో ఎండ్‌లో వచ్చిన వారు వచ్చినట్టుగా వెంటవెంటనే వీడుతున్నా.. తాను మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. అతని తరువాత హ్యారీ బ్రూక్ (17), జోఫ్రా ఆర్చర్ (12) మాత్రమే రెండెంకెల స్కోర్ చేయగలిగారు. మిగిలిన బ్యాటర్లంతా విఫలం. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.