ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండ్రోజుల ఆట ముగియగా.. ఈ మ్యాచ్ పై టీమిండియా పట్టు బిగిచింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లీష్ బ్యాటర్లు 246 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో రోజు ఆట ముగిసే సరికి భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసింది. దీంతో 175 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
ఇదిలావుంటే, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్ సీఏ) పాఠశాల విద్యర్థులకు ప్రవేశం కల్పించడంతో ఉప్పల్ స్టేడియం జనసంద్రంలా మారిపోయింది. వీరికి తోడు రిపబ్లిక్ డే(జనవరి 26) సంధర్బంగా సాయుధ దళాల సిబ్బందికి, వారి కుటుంబసభ్యులకు ఉచితం కావడంతో స్టేడియం ప్రేక్షకులతో కళకళలాడింది. కళ్ల ముందు అంతర్జాతీయ ఆటగాళ్లు కనిపించడంతో స్కూల్ విద్యార్థుల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. తమ అభిమాన క్రికెటర్ ప్లకార్డులు చేత పట్టుకొని కేరింతలు కొట్టారు. స్టేడియంలో పలువురు ప్రేక్షకులు ప్రదర్శించిన ప్లకార్డులు ఆకట్టుకున్నాయి.
#IndiavsEngland1stTest, #RajivGandhInternationalStadium, #Uppal #Hyderabad pic.twitter.com/zguexkccik
— vardhan reddy (@gova3555) January 26, 2024