చెన్నై: ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో కోల్‌కతాలో ఇంగ్లండ్‌ను తొలి దెబ్బకొట్టి సిరీస్‌లో శుభారంభం చేసిన టీమిండియా ఇప్పుడు తమ ఆధిక్యాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం రాత్రి జరిగే రెండో టీ20లోనూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈడెన్ గార్డెన్స్‌లో చూపెట్టిన జోరును కొనసాగిస్తూ చెపాక్‌లోనూ ఇంగ్లిష్ టీమ్‌కు చెక్ పెట్టి సిరీస్‌లో ఆధిక్యం దక్కించుకోవాలని చూస్తోంది. అదే సమయంలో వెటరన్ పేసర్ మహ్మద్ షమీ ఫిట్‌నెస్‌పై స్పష్టత కొనసాగుతోంది. 14 నెలల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన 34 ఏండ్ల షమీ తొలి పోరులోనే బరిలోకి దిగుతారని అభిమానులు ఆశించారు. కానీ, అతని సంసిద్ధతను టీమ్ మేనేజ్‌మెంట్ లోతుగా పరిశీలించాలనుకోవడంతో రీఎంట్రీ వాయిదా పడింది.
షమీ లేకపోయినా కోల్‌కతాలో దుమ్మురేపిన సూర్యకుమార్‌సేన చెన్నైలోనూ అలాంటి పెర్ఫామెన్స్‌ను రిపీట్ చేయాలని డిసైడవ్వగా.. ఈ మ్యాచ్‌లో గెలిచి లెక్క సమం చేయాలని ఇంగ్లండ్ కోరుకుంటోంది. ఈ మ్యాచ్ కోసం చెపాక్‌లో నల్ల మట్టితో కూడిన కొత్త పిచ్ రెడీగా ఉంది. ఇక్కడి వికెట్ సహజంగానే స్పిన్నర్లకు అనుకూలిస్తుంది.
సూర్య ఫామ్‌లోకి వచ్చేనా..
తొలి పోరులో అన్ని విభాగాల్లో అదరగొట్టడంతో టీ20ల్లో టీమిండియా వరుస విజయాల రికార్డు కొనసాగింది. పేస్, స్పిన్‌కు అనుకూలించిన ఈడెన్ గార్డెన్స్ వికెట్‌పై అర్ష్‌దీప్, హార్దిక్‌కు తోడు స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. చెపాక్ వికెట్ స్పిన్‌కు అనుకూలం కావడంతో ఇప్పుడు వరుణ్, అక్షర్‌తో పాటు రవి బిష్ణోయ్ కూడా కీలకం కానున్నాడు. గత మ్యాచ్‌లో సంజు శాంసన్ మెరుపు ఆరంభం.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ధనాధన్ బ్యాటింగ్‌తో చిన్న టార్గెట్‌ను ఇండియా ఈజీగా ఛేజ్ చేసింది. గతేడాది జతకట్టిన ఈ ఇద్దరు ఓపెనర్లు జట్టు విజయాలకు పునాది వేస్తున్నారు. కానీ, శుక్రవారం క్యాచింగ్ డ్రిల్స్ చేస్తుండగా అభిషేక్‌కు మడమ బెణికింది. ఫిజియోతో చికిత్స చేయించుకున్న తర్వాత కొద్దిగా కుంటుతూ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన అతను నెట్ ప్రాక్టీస్‌కు రాలేదు.
ALSO READ : మీకు ఐపీఎల్ ట్రోఫీ కావాలి.. RCBపై కుల్దీప్ యాదవ్ సెటైర్లు
గాయం పెద్దదై అభిషేక్ ఈ మ్యాచ్‌కు దూరం అయితే ధ్రువ్ జురెల్ తుది జట్టులోకి రావొచ్చు. అప్పుడు ఇండియా ఓపెనింగ్ కాంబినేషన్‌ను మార్చాల్సి ఉంటుంది. మరోవైపు సూర్యకుమార్ ఫామ్‌పై కాస్త ఆందోళన ఉంది. కోల్‌కతాలో డకౌటైన సూర్య గతేడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత ఆడిన 11 మ్యాచ్‌ల్లో రెండు ఫిఫ్టీలు మాత్రమే కొట్టాడు. కాసేపు క్రీజులో నిలిస్తే తన మార్కు షాట్లతో ఆట స్వరూపాన్ని మార్చే సత్తా ఉన్న సూర్య ఫామ్‌లోకి రావాలని టీమ్ మేనేజ్‌మెంట్, ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక, శుక్రవారం జరిగిన సెషన్‌లో షమీ ముమ్మర సాధన చేశాడు. ఆ టైమ్‌లో రెండు మోకాళ్లకు స్ట్రాప్స్ వేసుకున్నాడు. దాంతో అతను తుది జట్టులోకి వచ్చే విషయంపై స్పష్టత రాలేదు.
బట్లర్ సేన గాడిలో పడేనా..
తొలి పోరులో బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోయిన ఇంగ్లండ్ ఆతిథ్య జట్టుకు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. మరోసారి ఓడితే సిరీస్‌లో పుంజుకోవడం కష్టమైన నేపథ్యంలో చెపాక్‌లో ఆ జట్టు సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. స్పిన్ వికెట్‌పై సీనియర్ స్పిన్నర్ ఆదిల్ రషీద్, ఆల్‌రౌండర్ లివింగ్‌స్టోన్ సత్తా చాటాలని కోరుకుంటోంది. అదే సమయంలో బ్యాటింగ్‌లో ఓపెనర్లు ఫిల్ సాల్ట్, బెన్ డకెట్ నుంచి మంచి ఆరంభం అవసరం. ఈ మ్యాచ్ కోసం తమ తుది జట్టులో గస్ అట్కిన్సన్ స్థానంలో మరో పేసర్ బ్రైడన్ కార్స్‌ను తీసుకుంది. జాకబ్ బెతెల్ అనారోగ్యానికి గురైన నేపథ్యంలో వికెట్ కీపర్ జెమీ స్మిత్‌ను 12వ ప్లేయర్‌గా ప్రకటించింది.