చెపాక్ వేదికగా జరుగుతోన్న రెండో టీ20లో ఇంగ్లండ్ బ్యాటర్లు పర్వాలేదనిపించారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేశారు. జోస్ బట్లర్ (30 బంతుల్లో 45; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), జేమీ స్మిత్(12 బంతుల్లో 22; ఒక ఫోర్, 2 సిక్స్‌లు), బ్రైడన్ కార్స్(17 బంతుల్లో 31; ఒక ఫోర్, 3 సిక్స్‌లు) రాణించారు.
ఒక దశలో 90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లండ్ జట్టును స్మిత్, కార్స్ ఆదుకున్నారు. వికెట్లు పడుతున్నా.. భారత్ ఎదుట మంచి లక్ష్యాన్ని నిర్దేశించాలనే తాపత్రయంతో ఇంగ్లండ్ బ్యాటర్లు దూకుడుగా బ్యాటింగ్ చేశారు. అభిషేక్ శర్మ వేసిన 13 ఓవర్‌లో తొలి రెండు బంతులకు సిక్స్, ఫోర్ బాదిన జేమీ స్మిత్.. మూడో బంతిని భారీ షాట్ ఆడబోయి లాంగాఫ్‌లో తిలక్ చేతికి చిక్కాడు. అక్షర్ పటేల్ వేసిన ఆ మరుసటి ఓవర్‌లో కార్స్.. సిక్స్, ఫోర్ బాదాడు. దాంతో, ఆ ఓవర్‌లో 12 పరుగులు వచ్చాయి. వరుణ్ చక్రవర్తి వేసిన 16వ ఓవర్‌లోనూ చికార్స్ వరుస సిక్సర్లు బాదాడు. ఇలా ఇంగ్లండ్ బ్యాటర్లు క్రీజులో ఉన్నంతసేపు కౌంటర్ అటాక్ చేశారు.
భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2, అక్షర్ పటేల్ 2, అర్ష్‌దీప్, హార్దిక్ పాండ్య, అభిషేక్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.
India need 166 runs to go 2-0 up in the series 🏏#INDvENG ball-by-ball: https://t.co/U6u0fkPkSm pic.twitter.com/liChiBTUPB
— ESPNcricinfo (@ESPNcricinfo) January 25, 2025