శనివారం(జనవరి 25) చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టీ20 జరగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. చెపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా, నెమ్మదిగా ఉంటుంది. దాంతో సూర్య బౌలింగ్ వైపు మొగ్గు చూపాడు.
గాయాలు.. నితీష్, రింకూ దూరం
ఇప్పటికే తొలి 20లో గెలిచి ఆధిక్యంలో ఉన్న టీమిండియాను గాయాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఆల్‌రౌండర్ నితీష్ రెడ్డి, ఫినిషర్ రింకూ సింగ్ ఇద్దరూ గాయాల కారణంగా దూరమయ్యారు. నితీష్ రెడ్డి సైడ్ స్ట్రెయిన్‌తో బాధపడుతుండగా.. తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు రింకూకు వెన్ను పెట్టేసిందట. వీరి స్థానంలో వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ తుది జట్టులోకి వచ్చారు.
తుది జట్లు
టీమిండియా: సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లండ్: బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), జోస్ బట్లర్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ స్మిత్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
🚨 Toss 🚨#TeamIndia win the toss and elect to field 🙌
— BCCI (@BCCI) January 25, 2025
Updates ▶️ https://t.co/6RwYIFWg7i#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/WlWb5fiIoK