విశాఖపట్నం, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా శుక్రవారం(ఫిబ్రవరి 2) నుంచి భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
తొలి టెస్టులో ఓడిన రోహిత్ సేన ఈ టెస్టులో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. ఒకవేళ ఈ టెస్టులో ఓడినా లేదా డ్రాతో సరిపెట్టుకున్నా సీరీస్ నెగ్గాలంటే మిగిలిన మూడు టెస్టులు గెలవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ను మట్టికరిపించి సీరీస్ సమం చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు మూడు మార్పులు చేసింది. గాయపడ్డ రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్‌ల స్థానంలో కుల్దీప్ యాదవ్, రజిత్ పటీదార్, సిరాజ్ స్థానంలో ముకేష్ కుమార్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. పటీదార్‌కు ఇదే తొలి టెస్ట్. మరోవైపు ఇంగ్లాండ్ సైతం రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. మార్క్ ఉడ్ స్థానంలో జేమ్స్ అండర్సన్, జాక్ లీచ్ స్థానంలో షోయాబ్ బషీర్ జట్టులోకి వచ్చారు.
తుది జట్లు
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రజత్ పాటిదార్, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ , కెఎస్ భరత్ (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్.
ఇంగ్లాండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్( వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, జేమ్స్ ఆండర్సన్, షోయబ్ బషీర్.
A look at #TeamIndia's Playing XI for the 2nd #INDvENG Test ?
— BCCI (@BCCI) February 2, 2024
Follow the match ▶️ https://t.co/X85JZGt0EV@IDFCFIRSTBank pic.twitter.com/fE4mYc9yfw