తొలి టెస్టులో ఓటమిపాలైన టీమిండియా రెండో టెస్టులో ధీటుగా బదులిస్తోంది. గత మ్యాచ్‌లో చేసిన తప్పిదాలు పునరావృతం చేయకుండా నిలకడగా ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగుల ఆధిక్యం సాధించిన భారత జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ పర్వాలేదనిపిస్తోంది. పేలవ ఫామ్‌తో సతహమవుతున్న శుభ్ మాన్ గిల్(52 నాటౌట్; 4 ఫోర్లు) ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. కీలక సమయంలో హాఫ్ సెంచరీ సాధించాడు.
28/0 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత జట్టు తొలి 4 ఓవర్లలోనే 2 కీలక వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ(13) మరోసారి విఫలమవ్వగా.. డబుల్ సెంచరీ హీరో జైస్వాల్(17) పరుగులకే వెనుదిరిగాడు. ఆ సమయంలో గిల్- అయ్యర్ జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. నిలకడగా ఆడుతూ 81 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం ధాటిగా ఆడే ప్రయత్నంలో అయ్యర్(29) వెనుదిరగ్గా.. అతని స్థానంలో క్రీజులోకి వచ్చిన పటీదార్(9) అతని వెంటే పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం టీమిండియా స్కోర్.. 122/4(31 ఓవర్లు). గిల్(54 నాటౌట్), అక్సర్ పటేల్(0 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
He survived a few lbw shouts and edges, and Shubman Gill has made it count #INDvENG
— ESPNcricinfo (@ESPNcricinfo) February 4, 2024
▶️ https://t.co/ZsyelyZUeZ pic.twitter.com/CYqdHN0ifK