IND vs ENG: జైస్వాల్‌ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా టీమిండియా

IND vs ENG: జైస్వాల్‌ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా టీమిండియా

విశాఖ తీరాన ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌(103 నాటౌట్) సెంచరీతో కదం తొక్కాడు.  151  బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో జైస్వాల్ సెంచరీ మార్క్ చేరుకున్నాడు. రోహిత్ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ త్వరగా పెవిలియన్ చేరినా.. జైస్వాల్ ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. ఒకవైపు నిలకడగా ఆడుతూనే.. మరోవైపు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీల మోత మోగిస్తున్నాడు. దీంతో భారత జట్టు 49 ఓవర్లు మురిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది.

also read :- ధోని పేరు వినపడినప్పుడల్లా బాధపడేవాడిని: రిషబ్ పంత్ 

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత ఓపెనర్లు రోహిత్ శర్మ(14), యశస్వి జైస్వాల్‌ మంచి ఆరంభాన్ని ఇచ్చారు.. వీరిద్దరూ తొలి వికెట్‌కు 40 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని షోయబ్ బషీర్ విడగొట్టాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్‌ గిల్‌(34) కుదురుకున్నట్లు అనిపించినా.. ఆండర్సన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ సమయంలో శ్రేయాస్ అయ్యర్- జైస్వాల్ జోడి భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. ప్రస్తుతం జైస్వాల్(103 నాటౌట్), అయ్యర్(22 నాటౌట్) క్రీజులో ఉన్నారు.