IND vs ENG: గ్రీన్ ఆర్మ్ బ్యాండ్లు ధరించిన క్రికెటర్లు.. ఏంటి ఈ ప్రచారం..?

IND vs ENG: గ్రీన్ ఆర్మ్ బ్యాండ్లు ధరించిన క్రికెటర్లు.. ఏంటి ఈ ప్రచారం..?

అహ్మదాబాద్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేకి ఓ ప్రత్యేకత ఉంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు గ్రీన్ ఆర్మబ్యాండ్లు ధరించి ఆడుతున్నారు. అందుకు కారణం.. అవయవ దానం. ‘అవయవ దానం చేయండి.. ప్రాణాలను కాపాడండి’ (Donate Organs, Save Lives) అనే నినాదంతో ఇరు జట్ల క్రికెటర్లు ముందుకు కదిలారు. 

ఒకరు మరణించిన తరువాత కూడా జీవించేందుకు అత్యుత్తమ మార్గం అవయవదానం. చనిపోయిన వ్యక్తుల గుండె, కాలేయం, కిడ్నీలు, క్లోమగ్రంధి, ఊపిరి తిత్తులు, చిన్నపేగు, కార్నియా, చర్మం, నరాలు, గుండె కవాటాలు దానం చేయొచ్చు. తద్వారా మనిషి భౌతికంగా లేకపోయినా మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. ఒకరి అవయవ దానంతో ఎనిమిది మందికి కొత్త జీవితాన్ని ఇవ్వొచ్చు. దీనిపై అవగాహన కల్పించేందుకు ఇరు జట్ల క్రికెటర్లు నడుం బిగించారు. 

Also Read :-  ఐపీఎల్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్ టెన్షన్

ఒక ప్రతిజ్ఞ, ఒక నిర్ణయం, ఎందరో ప్రాణాలు కాపాడుతుంది. మనందరం కలిసి వచ్చి మార్పు తీసుకొద్దాం.. అనే నినాదంతో ముందుకు కదిలారు. టాస్‌కు ముందు కెప్టెన్లు రోహిత్, బట్లర్ ఇద్దరూ ‘డొనేట్ ఆర్గన్స్ సేవ్ లైవ్స్’ అనే బోర్డుపై సంతకాలు చేశారు. ఇతరుల నుంచి ఊపిరితిత్తులు తీసుకున్న గుజంన్ ఉమాంగ్, కిడ్రీ గ్రహీత దీప్తితో కలిసి ఫొటోలు దిగారు. అందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇదిలావుంటే, టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ తన ఆర్గన్స్ డొనేట్ చేస్తానని ప్రకటించారు.