భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలవడంలోనూ రికార్డులు సృష్టిస్తున్నాడు. ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో వరుసగా మూడోసారి టాస్ నెగ్గాడు. రాజ్‌కోట్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మంగళవారం(జనవరి 28) మూడో టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ పిచ్‌లో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చు కనుక బౌలింగ్ వైపు మొగ్గుచూపాడు. భారత పేసర్ మహ్మద్ షమీ ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు.
2-0 ఆధిక్యంలో భారత్
ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో టీమిండియా ప్రస్తుతం 2-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ సొంతమైనట్టే. కుర్రాళ్లు ఒకరు కాకపోతే మరొకరు అదిరిపోయే ప్రదర్శనలతో పటిష్టమైన ఇంగ్లండ్‌కు చుక్కలు చూపిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ ఔరా అనిపిస్తున్నారు. రాజ్‌కోట్‌లోనూ అదే ఊపును కొనసాగించి సిరీస్ సొంతం చేసుకోవాలన్నది మనోళ్ల వ్యూహం. సిరీస్ డిసైడర్ మ్యాచ్ కనుక ఉర్రూతలూగించటం ఖాయం.
తుది జట్లు
టీమిండియా: సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లాండ్: బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), జోస్ బట్లర్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ స్మిత్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
🚨 Toss Update from Rajkot 🚨#TeamIndia have elected to bowl against England in the 3⃣rd #INDvENG T20I.
— BCCI (@BCCI) January 28, 2025
Updates ▶️ https://t.co/amaTrbtzzJ@IDFCFIRSTBank pic.twitter.com/Dg321U3AQ6