వరుస ఓటములు ఎదురవుతున్న ఇంగ్లాండ్ బ్యాటర్ల ఆటలో ఎటువంటి మార్పు రావడం లేదు. గత రెండు టీ20లానే మూడో మ్యాచ్‌లోనూ తడబడ్డారు. దూకుడుగా ఆడాలన్న అత్యాశే.. మరోసారి వారి కొంపముంచింది. కాకపోతే, ఈసారి టెయిలెండర్లు ఆదుకొని ఆ జట్టును ఒడ్డున పడేశారు.
రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 171 పరుగులు చేసింది. బెన్ డకెట్ (28 బంతుల్లో 51) హాఫ్ సెంచరీ చేయగా.. చివరలో లివింగ్‌స్టోన్(24 బంతుల్లో 43) సిక్సర్ల మోత మోగించాడు. భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు పడగొట్టాడు.
Double-wicket over 👌
— BCCI (@BCCI) January 28, 2025
Completion of fifer for Varun Chakaravarthy 👌
Updates ▶️ https://t.co/amaTrbtzzJ#TeamIndia | #INDvENG | @chakaravarthy29 | @IDFCFIRSTBank pic.twitter.com/ne0Ze0lppj
వరుణ్ పాంచ్ పటాకా..
ఈ మ్యాచ్ పడుతూ.. లేస్తూ సాగింది. 12 ఓవర్లు ముగిసేసరికి వంద పరుగులతో పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్ భారీ స్కోర్ దిశగా వెళ్తున్నట్లు అనిపించింది. ఆ సమయంలో వరుణ్ చక్రవర్తి ఇంగ్లాండ్‌ను దెబ్బతీశాడు. వరుస ఓవర్లలో జోస్ బట్లర్(24), జామీ ఓవర్టన్(0), జామీ స్మిత్(6), బ్రైడన్ కార్సే(6)లను ఇంగ్లీష్ శిబిరంలో అలజడి రేపాడు. దాంతో, ఇంగ్లీష్ జట్టు 127 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది.
బిష్ణోయ్ సమర్పణ
127/8తో పీకల్లోతు కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ను లివింగ్‌స్టోన్(24 బంతుల్లో 43) ఆదుకున్నాడు. రవి బిష్ణోయ్ వేసిన 17 ఓవర్లో మూడు సిక్సర్లు బాదాడు. దాంతో, ఇంగ్లండ్ మరోసారి రేసులో నిలిచింది. ఆ మరుసటి ఓవర్లోనే అతడు వెనుదిరగ్గా.. చివరలో ఆదిల్ రషీద్ (10 నాటౌట్), మార్క్ వుడ్ (10 నాటౌట్) జట్టును ఒడ్డున పడేశారు.
Innings Break! #TeamIndia limit England to 171/9 in Rajkot!
— BCCI (@BCCI) January 28, 2025
5⃣ wickets for Varun Chakaravarthy
2⃣ wickets for Hardik Pandya
1⃣ wicket each for Axar Patel & Ravi Bishnoi
Stay Tuned for India's chase! ⌛️
Scorecard ▶️ https://t.co/amaTrbtzzJ#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/rZDaKwjCpM
ALSO READ | ICC Awards 2024: 2024 ఐసీసీ అవార్డుల పూర్తి జాబితా