ఇంగ్లండ్ ముందు భారీ స్కోర్ ఉంచామన్న ఆనందం భారత అభిమానులకు ఎక్కువ సేపు నిలవలేదు. బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లీష్ ఓపెనర్లు ఎడా పెడా బౌండరీలు బాధేస్తున్నారు. ముఖ్యంగా బెన్ డకెట్(68*; 52 బంతుల్లో 14 ఫోర్లు) భారత బౌలర్లను చెడుగుడు ఆడుతున్నాడు. తమదైన బజ్‌బాల్ దూకుడుతో మైదానం నలువైపులా ఫీల్డర్లను పరుగులు పెట్టిస్తున్నాడు. క్లాసిక్ కవర్ డ్రైవ్‌లకు తోడు రివర్స్ స్వీప్ షాట్లతోనూ పరుగులు సాధిస్తున్నాడు.
also read : సిరీస్ నెగ్గడానికి 92 ఏళ్లు పట్టింది.. చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్
బుమ్రా వేసిన తొలి ఓవర్ లో ఆచి తూచి ఆడిన డకెట్.. సిరాజ్ బంతిని చేతికి అందుకోగానే బ్యాట్‌కు పని చెప్పాడు. ఓవర్‌కు రెండు ఫోర్ల చొప్పున అతన్ని టార్గెట్ చేసి మరీ కొట్టాడు. అయినప్పటికీ.. రోహిత్ వెనకడుగు వేయలేదు. కొట్టుకోండి అన్నట్లు అతన్నే కొనసాగించాడు. దీంతో ఇంగ్లీష్ ఓపెనర్ మరింత చెలరేగిపోయాడు. 11 ఫోర్ల సాయంతో 38 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ చేరుకున్నాడు. సిరాజ్ వేసిన 10వ ఓవర్‌లో ఏకంగా 13 పరుగులు వచ్చాయి. ఇక చాలనుకున్న హిట్ మ్యాన్.. సిరాజ్‌కు విశ్రాంతినిచ్చి కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్‌లను రంగంలోకి దించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోర్ 13 ఓవర్లు ముగిసేసరికి.. 89/0.
Ben Duckett races to his half-century in 39 balls! He's hit 11 boundaries so far! #INDvENG
— ESPNcricinfo (@ESPNcricinfo) February 16, 2024