
ఆట ప్రారంభమై రెండు ఓవర్లు గడిచాయంతే.. 12 పరుగులకే 3 కీలక వికెట్లు. మైదానంలో నిశ్శబ్దం.. భారత డగౌట్‌లో టెన్షన్ వాతావరణం.. అలాంటి దశలో జట్టు స్కోర్ 150 పరుగులు దాటితే చాలని అంతా అనుకున్నారు. అటువంటిది టీమిండియా ఏకంగా.. 181 పరుగులు చేసింది. ఆ ఘనత ఎవరిదంటే.. జట్టులో పెద్దన్న పాత్ర పోషించే పాండ్యది.
మొదట్లో ఆచి తూచి ఆడుతూ స్కోర్ బోర్డును కదిలించిన పాండ్యా.. క్రీజులో కుదురుకున్నాక చెలరేగి ఆడాడు. మైదానం నలుమూలలా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 16వ ఓవర్లో.. 16 పరుగులు, 17వ ఓవర్లో.. 17 పరుగులు, 18వ ఓవర్లో.. 18 పరుగులు రాబట్టాడు. అదే ఓవర్ ఆఖరికి అతడు ఔటవ్వడం.. ఇంగ్లండ్‌ను ఊపిరి పీల్చుకునేలా చేసింది. 19వ ఓవర్లో 12 పరుగులు వచ్చినప్పటికీ, ఆఖరి ఓవర్‌లో 3 పరుగులే వచ్చాయి. అదే భారత అభిమానులను నిరాశపరిచిన ఒక్కే ఒక విషయం.
ఇంగ్లండ్ టార్గెట్ 181
మొత్తానికి టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 181 పరుగులు చేసింది. పాండ్యా(30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), దూబే(34 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేశారు. రింకూ సింగ్(26 బంతుల్లో 30), అభిషేక్ శర్మ(19 బంతుల్లో 29) పరుగులతో పర్వాలేదనిపించారు.
Also Read :- ఒకే ఓవర్‌లో 3 వికెట్లు.. కష్టాల్లో టీమిండియా
ఇంగ్లీష్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ 3, జామీ ఓవర్టన్ 2, బ్రైడన్ కార్సేఆదిల్ రషీద్ చెరో వికెట్ పడగొట్టారు.
??????? ?????!#TeamIndia posted 181/9 on the board! ? ?
— BCCI (@BCCI) January 31, 2025
5⃣3⃣ for Hardik Pandya
5⃣3⃣ for Shivam Dube
3⃣0⃣ for Rinku Singh
2⃣9⃣ for Abhishek Sharma
Over to our bowlers now! ? ?
Follow The Match ▶️ https://t.co/pUkyQwxOA3#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/83OOqZ2apD