పూణే గడ్డపై పరుగుల వరద అనుకుంటే.. మనోళ్లు ఎదో చేసేట్టే కనపడుతున్నారు. ఇంగ్లండ్‌తో జరుగుతోన్న నాలుగో టీ20లో భారత జట్టుకు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. 2 ఓవర్లు ముగిసేసరికే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ పేసర్ సాకిబ్ మహమూద్.. ఒకే ఓవర్‌లో ఇండియాను దెబ్బతీశాడు.
రెండో ఓవర్ వేసిన ఈ ఇంగ్లీష్ పేసర్.. బంతుల వ్యవధిలో సంజూ శాంసన్(1), తిలక్ వర్మ(0), సూర్యకుమార్ యాదవ్(0) పెవిలియన్ చేర్చాడు. తొలి బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి శాంసన్.. కార్స్ చేతికి చిక్కాడు. క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ.. ఆ మరుసటి బంతికే పెవిలియన్ చేరాడు. బౌండరీ వద్ద జోఫ్రా ఆర్చర్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ సమయంలో ఆదుకోవాల్సిన సూర్య.. ఆఖరి బంతికి కార్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రెండో ఓవర్‌లో ఒక్క పరుగూ రాలేదు.
❌ Sanju Samson for one run
— ESPNcricinfo (@ESPNcricinfo) January 31, 2025
❌ Tilak Varma for a duck
❌ Suryakumar Yadav for a duck
An over to remember for Saqib Mahmood and England; One to forget for India 😮 #INDvENG pic.twitter.com/3p5kNWXUta
Also Read :- టాస్ వాళ్లది.. బ్యాటింగ్ మనది
ఇక ఆశలన్నీ రింకూ సింగ్, అభిషేక్ శర్మలపైనే. వీరిద్దరూ 10 ఓవర్ల వరకు క్రీజులో ఉంటే ఇంగ్లండ్ ఎదుట ధీటైన లక్ష్యాన్ని నిర్ధేశించవచ్చు. లేదంటే అదే పరిస్థితి. వెనుక హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలు ఉన్నా.. భారీ టార్గెట్ ఆశించడం అత్యాశే.