సొంతగడ్డపై వరుసగా 17వ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిచిన టీమిండియా

సొంతగడ్డపై వరుసగా 17వ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిచిన టీమిండియా
  •     నాలుగో టెస్టులో 5 వికెట్లతో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గెలుపు
  •     రాణించిన రోహిత్, గిల్, జురెల్
  •     డబ్ల్యూటీసీలో రెండో ప్లేస్‌‌కు

రాంచీ:  సొంతగడ్డపై టీమిండియా దెబ్బకు ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బద్దలైంది. నాలుగో టెస్టులో ఓటమి అంచుల నుంచి విజయతీరాలకు చేరిన రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేన స్వదేశంలో తమకు తిరుగులేదని మరోసారి చాటి చెప్పింది. నాలుగో రోజు, సోమవారం ముగిసిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించింది.  ఐదు టెస్టుల సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిగిలుండగానే 3–1తో ఖాయం చేసుకుంది. సొంతగడ్డపై ఇండియాకు ఇది వరుసగా 17వ సిరీస్ విజయం కావడం విశేషం. కెప్టెన్ రోహిత్ శర్మ (81 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 55), శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్ గిల్ (124 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2 సిక్సర్లతో 52 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఫిఫ్టీలతో రాణించడంతో 192 రన్స్ టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇండియా 61 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. ధ్రువ్ జురెల్ (77 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లతో 39 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) కూడా ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో  షోయబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బషీర్ మూడు వికెట్లు పడగొట్టాడు. ధ్రువ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జురెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో డబ్ల్యూటీసీలో ఇండియా రెండో ప్లేస్‌‌కు దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య చివరి, ఐదో టెస్టు మార్చి ఏడు నుంచి ధర్మశాలలో జరుగుతుంది.  

గట్టెక్కించిన గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ధ్రువ్

విజయానికి మరో 152 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం  ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 40/1తో నాలుగో రోజు ఛేజింగ్ కొనసాగించిన ఇండియాకు ఓపెనర్లు రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యశస్వి జైస్వాల్ (37) మంచి పునాదే వేశారు. స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే పేసర్ అండర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రోహిత్ లాంగాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీదుగా సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టాడు. సింగిల్స్‌‌తో పాటు వరుసగా బౌండ్రీలు రాబట్టిన ఓపెనర్లు  స్పిన్నర్ల లో బౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్వీప్, రివర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వీప్ షాట్లతో ఎదుర్కొన్నారు. దాంతో బెన్ స్టోక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. జో రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బరిలోకి దింపాడు. రూట్ వేసిన ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెంగ్త్ టర్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జైస్వాల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రా కవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీదుగా షాట్ ఆడే ప్రయత్నం చేయగా అది ఎడ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకొని గాల్లోకి లేచింది. బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్డ్ పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అండర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముందుకు డైవ్ చేస్తూ క్యాచ్ పట్టాడు. దాంతో తొలి వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 84 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ బ్రేక్ అయింది. ఆ తర్వాత రెండు ఎండ్ల నుంచి బషీర్, హార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లీతో బౌలింగ్ చేయించిన స్టోక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు.  వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన గిల్ స్ట్రయిక్ రొటేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయలేక ఇబ్బంది పడ్డాడు. 

ఈ కారణంగా క్రీజులో కుదురుకున్న రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నా ఒత్తిడి పడింది. చాలా సేపటి వరకు బౌండ్రీలు ఆగిపోవడంతో హార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లీ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రీజు దాటొచ్చి షాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ట్రై చేశాడు. కానీ, ఫ్లయిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వచ్చిన బాల్ ఎడ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకొని కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేతిలో పడింది. ఇక్కడి నుంచి ఇండియా ఇబ్బందులు పెరిగాయి. తర్వాతి ఓవర్లోనే రజత్ పటీదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (0)ను బషీర్ డకౌట్ చేయడంతో  హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 118/3తో లంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లింది. బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి వచ్చిన వెంటనే జడేజా (4), సర్ఫరాజ్ ఖాన్ (0)ను వరుస బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెవిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేర్చిన బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియాను 120/5తో కష్టాల్లోకి నెట్టాడు. ఈ దశలో గిల్, ధ్రువ్ జురెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జట్టును ఆదుకున్నారు. ప్రత్యర్థి స్పిన్నర్లు ఇబ్బంది పెడుతున్నా ఇద్దరూ చాలా ఓర్పుగా, జాగ్రత్తగా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ ఒక్కో పరుగు రాబట్టారు.  31 ఓవర్ల పాటు ఒక్క బౌండ్రీ కూడా కొట్టకుండా సింగిల్స్, డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కరిగించారు. చివరకు బషీర్ వేసిన వైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెంగ్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జురెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోర్ కొట్టాడు. విజయానికి  మరో 20 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవసరం అయిన దశలో బషీర్ ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టిన గిల్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. హార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లీ వేసిన తర్వాతి ఓవర్ తొలి బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నే బౌండ్రీకి పంపిన జురెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. చివరి బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ముగించాడు. 

17
స్వదేశంలో ఇండియా వరుసగా గెలిచిన సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు. 2013 నుంచి ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు.  ఇండియా తర్వాత  అత్యధికంగా ఆస్ట్రేలియా సొంతగడ్డపై వరుసగా 10 సిరీస్‌‌లు గెలిచింది. 

9000  
రోహిత్ తన ఫస్ట్ క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 9 వేల రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరాడు. 

971
తన 8 టెస్టుల్లో జైస్వాల్ చేసిన రన్స్. ఎనిమిది టెస్టుల తర్వాత అత్యధిక రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సునీల్ గావస్కర్ (938 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)ను దాటేశాడు.

30--0
సొంతగడ్డపై 200 అంతకంటే తక్కువ టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా 33 టెస్టుల్లో 30సార్లు గెలిచింది. మరో మూడు డ్రాగా ముగిశాయి.

సంక్షిప్త స్కోర్లు:
ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 353;. ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 307; ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 145;  ఇండియా రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (టార్గెట్192): 61 ఓవర్లలో 192/5 (రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 55, గిల్ 52*, బషీర్ 3/79).