IND vs END 5th T20I: ముంబై గడ్డపై అభిషేక్ ఊచకోత.. 6 ఓవర్లలో 95 పరుగులు

IND vs END 5th T20I: ముంబై గడ్డపై అభిషేక్ ఊచకోత.. 6 ఓవర్లలో 95 పరుగులు

నామమాత్రమైన ఐదో టీ20లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఎదుర్కొన్న ప్రతి బంతిని బౌండరీకి తరలించడమే లక్ష్యంగా ఆడుతున్నాడు. ఆట మొదలై.. ఐదు ఓవర్లు కూడా పూర్తిగా గడవక ముందే హాఫ్ సెంచరీ చేశాడంటే.. అతడి విధ్వంసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి. 

ఈ హైదరాబాద్ ఓపెనర్ 17 బంతుల్లోనే యాభై మార్కును చేరుకున్నాడు. బంతి బ్యాట్ మధ్యలో తగిలితే సిక్స్.. కాస్త అటు ఇటుగా తగిలితే.. ఫోర్. ఇదీ అతడాట. ఇంగ్లండ్ బౌలర్లు ఎత్తుగడలు అతడి ముందు ఏమాత్రం పని చేయట్లేదు. అభిషేక్ ధాటికి టీమిండియా పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోయి 95 పరుగులు చేసింది.
 
ప్రస్తుతం అభిషేక్ శర్మ స్కోర్.. 21 బంతుల్లో 58 నాటౌట్. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి.