Abhishek Sharma: చిరంజీవి పాట.. మనోడి ఆట రెండూ ఒక్కటే.. అభిషేక్ మెరుపు సెంచరీ

Abhishek Sharma: చిరంజీవి పాట.. మనోడి ఆట రెండూ ఒక్కటే.. అభిషేక్ మెరుపు సెంచరీ

కొడితే కొట్టాలిరా
సిక్స్ కొట్టాలి
ఆడితే ఆడాలిరా
రఫ్ఫాడాలి

అచ్చం ఠాగూర్ మూవీలో బాస్ మెగాస్టార్ చిరంజీవి ఆడిపాడిన ఈ పాటలా భారత ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ సాగుతోంది. బంతి బ్యాట్ మధ్యలో తగిలితే సిక్స్.. కాస్త అటు ఇటుగా తగిలితే.. ఫోర్. అంతే తప్ప, బంతి బౌండరీకి వెళ్లడం ఎక్కడా ఆగలేదు. ప్రతి రోజూ క్రికెట్ చూసే వారికి అతడి బ్యాటింగ్ విసుగు పుట్టించిందంటే నమ్మండి. ఇంగ్లీష్ బౌలర్లు తాము అంతర్జాతీయ బౌలర్లమని ఎక్కడా చెప్పుకోకుండా కొడుతున్నాడు.

ALSO READ | IND vs END 5th T20I: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. భారత జట్టులో ఏకైక మార్పు

17 బంతుల్లో యాభై మార్కు చేరుకున్న అభిషేక్.. 37 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 10 సిక్స్‌లు ఉన్నాయి. 270 కి పైగా స్ట్రైక్ రేట్. అతడికిది రెండో అంతర్జాతీయ టీ20 సెంచరీ. అభిషేక్ ధాటికి టీమిండియా 11 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు నష్టపోయి 148 పరుగులు చేసింది. అతడు ఆఖరి వరకు క్రీజులో ఉన్నాడంటే.. భారత జట్టు 300 కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.