ఉప్పల్ వేదికగా భారత్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. భారత్-ఇంగ్లాండ్ మధ్య టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా భారత మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. తొలి టెస్టులో 10 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ ఈ ఘనత సాధించాడు.
సచిన్ టెండూల్కర్ 53 ఇన్నింగ్స్‌లలో 2535 పరుగులు చేయగా, రూట్ ఇప్పటివరకూ 45 ఇన్నింగ్స్‌లలో 2555 పరుగులు చేశాడు. ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి(1991) ఐదో స్ధానంలో ఉన్నాడు.
భారత్ vs ఇంగ్లండ్ టెస్టుల్లో అత్యధిక పరుగులు
- జో రూట్ - 2544*
- సచిన్ టెండూల్కర్ - 2535
- సునీల్ గవాస్కర్ - 2348
- సర్ అలిస్టర్ కుక్ - 2431
- విరాట్ కోహ్లీ - 1991
Joe Root surpasses Sachin Tendulkar to become the highest run-scorer in India-England Test matches ?#INDvsENG #JoeRoot #SachinTendulkar #TestCricket #CricketTwitter pic.twitter.com/WOA0ZRkwU8
— InsideSport (@InsideSportIND) January 25, 2024