భారత్- ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన మిగిలిన మూడు టెస్టులకు స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్ దూరమయ్యాడు. ఎడమ మోకాలి గాయం కావడంతో లీచ్ మిగిలిన సిరీస్‌కు దూరమైనట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రకటన చేసింది. అతడు త్వరలోనే ఇంగ్లండ్‌కు పయనం కానున్నాడు. లీచ్ దూరమవ్వడంతో ఇంగ్లాండ్ స్పిన్ లైనప్ పేలవంగా కనిపిస్తోంది. అనుభవం లేని రెహాన్ అహ్మద్, షోయబ్ బషీర్, టామ్ హార్ట్లీలతోనే నెట్టుకు రావాలి.
ఐదు మ్యాచ్‌ల సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 28 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందగా, విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ 106 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో టెస్ట్ రాజ్‌కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానుంది.
We're all with you, Leachy ❤️
— England Cricket (@englandcricket) February 11, 2024
Nobody braver than you ?
Jack Leach has been ruled out of the remainder of our Test series with India.#INDvENG | #EnglandCricket
ఇంగ్లాండ్ జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్ , జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్, మార్క్ వుడ్, ఆల్లీ రాబిన్సన్, డేనియల్ లారెన్స్, గుస్ అట్‌కిన్సన్.