ఒకపైపు యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటుంటే, మరోవైపు అనుభవజ్ఞులైన రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్ పేలవంగా ఔట్ అవ్వడం అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. దీంతో వారు 'ఆడింది చాలు.. ఇక తప్పుకోండి.. సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్ వంటి దేశవాళీ క్రికెటర్లకు అవకాశమివ్వండి..' అంటూ.. రోహిత్, గిల్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
also read :- ధోని పేరు వినపడినప్పుడల్లా బాధపడేవాడిని: రిషబ్ పంత్
అసలేం జరిగిందంటే..
తొలి టెస్టులో ఓడిన భారత జట్టు.. విశాఖ సాగర తీరాన నేడు ఇంగ్లాండ్ తో రెండో టెస్టులో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్(141 నాటౌట్) సెంచరీతో కదం తొక్కగా.. సీనియర్ బ్యాటర్లైన రోహిత్(14), గిల్(34) స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. హిట్ మ్యాన్.. షోయబ్ బషీర్ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ గా వెనుదిరగ్గా, గిల్. ఆండర్సన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. గత ఏడు ఇన్నింగ్స్‌లలో గిల్.. అండర్సన్ బౌలింగ్ లో ఔటవ్వడం ఇది ఐదోసారి. గత కొంతకాలంగా వీరిద్దరూ పేలవ ఫామ్ కనపరుస్తున్నారు. దీంతో వీరిపై సోషల్ మీడియా వేదికగా అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు.
Captain Rohit Sharma sacrificed his innings so Shubman Gill could score a triple century.
— Anu - Proud Indian (@ProudIndian2222) February 2, 2024
But Gill as usual wasted this opportunity as well.
Prince is no longer charming#INDvsENGTest pic.twitter.com/xxLfiR7skN
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 72 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 250 పరుగులు చేసింది. ప్రస్తుతం జైస్వాల్(149 నాటౌట్), శ్రీకర్ భరత్(0 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
Rohit & Gill must be kicking themselves. An opportunity to score big at this venue is missed #INDvENG
— Tushar Rane (@tushnemma) February 2, 2024
Things you'll find in jimmy Anderson's pocket #INDvENG pic.twitter.com/6Zebvrxv5Q
— Nilxcasm (@tiredictfan0) February 2, 2024
Indian skipper Rohit Sharma has struggled to find form, managing to score just one half-century in his last 8 Test innings. pic.twitter.com/auZZ0sUNFC
— CricTracker (@Cricketracker) February 2, 2024