వరల్డ్ కప్ లో టీమిండియా నాకౌట్ సమరానికి సిద్ధమవుతుంది. సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ గురువారం (జూన్ 27) సాయంత్రం 8 గంటలకు ప్రారంభమవుతుంది. గయానా ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. రెండు జట్లు సమవుజ్జీలుగా ఉండడంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2022 టీ 20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ పై భారత్ 10 వికెట్ల తేడాతో చిత్తయిన సంగతి తెలిసిందే. ఈ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంటే.. ఇంగ్లాండ్ వరుసగా రెండో సారి టైటిల్ పై కన్నేసింది.
మ్యాచ్ కు వర్షం ముప్పు:
గయానా లో జరగబోయే ఈ మ్యాచ్ కు భారీ వర్షం ముప్పు ఉన్నట్లు వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. తాజా సమాచార ప్రకారం మ్యాచ్ జరిగే సమయంలో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందున ఈ బ్లాక్‌బస్టర్ మ్యాచ్ వాష్ అవుట్ అయ్యే ప్రమాదంలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అమెరికాలో ఈ మ్యాచ్ శుక్రవారం ఉదయం 10 గంటలకు జరుగుతుంది. ఈ సమయంలో అక్కడ ఉదయం భారీ వర్ష సూచన న్నట్లు తెలుస్తుంది. భారత కాలమాన ప్రకారం గురువారం (జూన్ 27) వర్షం కురిసే అవకాశం 88 శాతం ఉంది. ఈ పోరుకు రిజర్వ్ డే కూడా లేదు. ఒకవేళ మ్యాచ్ రద్దయితే సూపర్8లో ఎక్కువ పాయింట్లతో నిలిచిన ఇండియా ఫైనల్ చేరుతుంది.
Also Read:రషీద్ ఖాన్‌కు ఐసీసీ మందలింపు.. ఏం జరిగిందంటే..?
సూపర్8 రౌండ్‌లో ఇండియా హ్యాట్రిక్ విక్టరీలతో సత్తా చాటింది. చివరి మ్యాచ్‌కు వచ్చే సరికి అన్ని విభాగాల్లో జట్టు బలంగా మారింది. అయితే నాకౌట్ మ్యాచ్‌ల్లో ఉండే విపరీతమైన ఒత్తిడి అనవసర తప్పిదాలు చేసేలా చేస్తుంది. కోహ్లీ కీలక పోరులో అయినా బ్యాట్ ఝుళిపిస్తాడేమో చూడాలి. కంగారూలపై చేసిన పెర్ఫామెన్స్‌ను కెప్టెన్ రోహిత్ ఇంగ్లండ్‌పై రిపీట్ చేస్తే జట్టుకు తిరుగే ఉండదు. హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ మెరుపు ఈ టోర్నీలో ఇండియాకు అది పెద్ద బలం అవ్వగా..పేస్ లీడర్ బుమ్రా బంతికి తిరుగేలేకుండా పోయింది. సూపర్8లో ఇండియా ట్రంప్ కార్డ్‌గా పని చేసిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్‌లోనూ కీలకం కానున్నాడు.
మరోవైపు ఇంగ్లాండ్ జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్,బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, లివింగ్ స్టోన్, మొయిన్ అలీ, సామ్ కరన్ రూపంలో పవర్ హిట్టర్లు ఉన్నారు. బౌలింగ్ లో ప్రధాన స్పిన్నర్ ఆదిల్ రషీద్ నుంచి ఇండియాకు ముప్పు పొంచి ఉంది. జోఫ్రా ఆర్చర్, టాప్లీ కొత్త బంతితో అదరగొట్టానికి సిద్ధంగా ఉన్నారు.
IND vs ENG Guyana Weather Live Updates, T20 World Cup Semi-Final:
— Amit Paranjape (@aparanjape) June 27, 2024
80% Chance of Rain for India-England Match; Washout on the Cardshttps://t.co/VjfRlorYAn pic.twitter.com/J1Jyrq9oV8