జనవరి 25 నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి టెస్ట్ హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా జరగనుంది. ఇప్పటికే భారత్ చేరుకున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో తలమునకలై ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆ జట్టుకు గట్టి దురుదెబ్బ తగిలింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. అతడు మొత్తం టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు.
వ్యక్తిగత కారణాలరీత్యా బ్రూక్ తప్పుకున్నాడని ఇంగ్లాండ్ బోర్డు తెలిపినప్పటికీ.. ఆ కారణం ఏంటనేది బయటకి వెల్లడించలేదు. "హ్యారీ బ్రూక్ వెంటనే యునైటెడ్ కింగ్‌డమ్ తిరిగి వెళ్తాడు.. అతడు మళ్లీ భారతదేశానికి తిరిగి రాడు.." అని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఆదివారం ప్రకటన చేసింది. అదే సమయంలో అతని కుటుంబసభ్యుల అభ్యర్థన మేరకు గోప్యతను పాటిస్తున్నట్లు తెలిపింది.
ఇండియా vs ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్
- మొదటి టెస్ట్ (జనవరి 25 - జనవరి 29): హైదరాబాద్
- రెండో టెస్ట్ (ఫిబ్రవరి 02 - ఫిబ్రవరి 06): విశాఖపట్నం
- మూడో టెస్ట్ (ఫిబ్రవరి 15 - ఫిబ్రవరి 19) : రాజ్‌కోట్
- నాలుగో టెస్ట్ (ఫిబ్రవరి 23 - ఫిబ్రవరి 27): రాంచీ
- ఐదో టెస్ట్(మార్చి 7 - మార్చి 11): ధర్మశాల
Harry Brook is set to return home with immediate effect for personal reasons from the England Test tour of India.
— OneCricket (@OneCricketApp) January 21, 2024
The England selectors will confirm a replacement player for the tour in due course.#INDvsENG pic.twitter.com/m6lirT7z91