జనవరి 25 నుంచి భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనుండగా.. టికెట్ల విక్రయాల గురించి హెచ్‌సీఏ కీలక ప్రకటన చేసింది. తొలి టెస్టు మ్యాచ్ టికెట్ల అమ్మకాలు ఈ నెల 18వ తేదీ(గురువారం) నుంచి ప్రారంభించనున్నట్లు హెచ్‌సీఏ తెలిపింది.
జనవరి 18 నుంచి ఆన్‌లైన్ ద్వారా పేటీఎం ఇన్‌సైడర్ యాప్‌లో టికెట్ల విక్రయాలు సాగించనున్నారు. అనంతరం మిగిలిన టికెట్లను 22వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో పాటుగా జింఖానాలోని హెచ్‌సీఏ స్టేడియంలో ఆఫ్‌లైన్ ద్వారా అమ్మనున్నారు. అయితే, ఆన్‌లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వారు 22వ తేదీ నుంచి ఏదేని తమ ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి, టికెట్లను రిదీమ్ చేసుకోవాల్సి ఉంటుంది.
సాయుధ దళాల సిబ్బందికి ఫ్రీ ఎంట్రీ
రిపబ్లిక్ డే రోజును పురస్కరించుకొని దేశం కోసం అహర్నిశలు తమ రక్తం ధారబోస్తున్న భారత సాయుధ దళాల సిబ్బందికి హెచ్‌సీఏ శుభవార్త చెప్పింది. జనవరి 26వ తేదీ తెలంగాణలో పని చేస్తున్న భారత సాయుధ బలగాల (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్) సిబ్బంది వారి కుటుంబాలతో కలిసి ఉచితంగా మ్యాచ్ చూసే అవకాశం కల్పిస్తోంది. ఆసక్తి గల వారు తమ విభాగాధిపతితో సంతకం చేయించిన లేఖ, కుటుంబ సభ్యుల వివరాలను ఈనెల 18వ తేదీ లోపు హెచ్‌సీఏ సీఈఓకి ఈ-మెయిల్ చేయాలి.
టికెట్ల ధరలు
టెస్టు మ్యాచ్ టిక్కెట్ ప్రారంభ ధర కనిష్ఠంగా రూ.200 కాగా, గరిష్ఠంగా రూ.4 వేలుగా నిర్ణయించారు. సామాన్యులను దృష్టిలో పెట్టుకుని, అందరికి అందుబాటులో ఉండేలా ఈ ధరలు నిర్ణయించారు.
- రూ. 200
- రూ. 499
- రూ. 1000
- రూ. 1250
- ఉతర్త దిక్కు కార్పొరేట్ బాక్సులు విత్ హాస్పిటాలటీ రూ.3 వేలు
- దక్షిణ దిక్కు కార్పొరేట్ బాక్సులు విత్ హాస్పిటాలటీ రూ.4 వేలు