వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. ఆదివారం లక్నో వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటర్లు విఫలమైనప్పటికీ.. బౌలర్లు విజృంభించడంతో భారత్ అలవోకగా విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది.
230 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ 34.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. భారత పేసర్లు బుమ్రా, షమీ పేస్‌కు ఇంగ్లిష్ బ్యాటర్లు కుదేలయ్యారు. 27 పరుగులు చేసిన లివింగ్‌స్టోన్ ఆ జట్టులో టాప్ స్కోరర్. డేవిడ్ మలన్ (12), జానీ బెయిర్ స్టో (8), జో రూట్ (0), బెన్ స్టోక్స్(0), జోస్ బట్లర్(4), మోయిన్ అలీ(1) మరోసారి విఫలమయ్యారు. భారత బౌలర్లలో షమీ 4 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా 3, కుల్దీప్ 2, జడేజా ఒక వికెట్ తీసుకున్నారు.
అంతకుముందు భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(87), సూర్యకుమార్ యాదవ్ (49) పర్వాలేదనిపించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ 3 వికెట్లు తీసుకోగా.. క్రిస్ వోక్స్, అదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఈ గెలుపుతో టీమిండియా తిరిగి అగ్రస్థానానికి చేరుకోగా.. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ అధికారికంగా సెమీస్ రేసు నుంచి తప్పుకుంది.
??? ???'? ????, ???'? ????! Rohit Sharma's Team India is on a roll - 6/6. ?
? Getty • #RohitSharma #INDvENG #INDvsENG #CricketComesHome #CWC23 #TeamIndia #BharatArmy #COTI?? pic.twitter.com/VRSXhY88X8
— The Bharat Army (@thebharatarmy) October 29, 2023