గయానా వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతోన్న సెమీఫైనల్‌కు వర్షం మరోసారి అంతరాయం కలిగిస్తోంది. దాంతో, అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఉన్నట్టుండి వర్షం పడటంతో ఇరు జట్ల ఆటగాళ్లు డగౌట్‌కు పరుగులు తీశారు. ప్రస్తుతం టీమిండియా స్కోర్.. 8 ఓవర్లు ముగిసేసరికి 65/2. రోహిత్ శర్మ(37 నాటౌట్; 26 బంతుల్లో 6 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్(13 నాటౌట్; 7 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్) క్రీజులో ఉన్నారు.
ఆట ప్రారంభానికి ముందు కూడా వరుణుడు అంతరాయం కలిగించాడు. ఫలితంగా, మ్యాచ్ గంట 15 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం లభించలేదు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(9) మరోసారి నిరాశ పరిచాడు. టాప్లే వేసిన రెండో ఓవర్లో సిక్సర్‌తో టచ్‌లోకి వచ్చిన్టటే కనిపించినా.. ధాటిగా ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు. అనంతరం సామ్ కరన్ వేసిన ఆరో ఓవర్లో రిషభ్ పంత్(4) అనవరసంగా వికెట్ సమరిపించుకున్నాడు. ప్రస్తుతం రోహిత్- సూర్య ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
The rain is back in Guyana ☔️
— ESPNcricinfo (@ESPNcricinfo) June 27, 2024
India's innings is paused at 65/2 after 8 overshttps://t.co/sZqQjHaSVm | #INDvENG | #T20WorldCup pic.twitter.com/Y5Bs85r0l4