లక్నో వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు తడబడ్డారు. ధాటిగా ఆడే క్రమంలో అనవసరపు షాట్లకు ప్రయత్నించి వికెట్లు పారేసుకున్నారు. రోహిత్ శర్మ(87), సూర్యకుమార్ యాదవ్ (49) రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన భారత్‌కు మంచి ఆరంభం లభించలేదు. దూకుడుగా ఆడే ప్రయత్నంలో శుభ్‍మన్ గిల్ (9) పరుగులకే ఔటయ్యాడు. అనంతరం 9 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరడంతో భారత్‌కు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. ఆ సమయంలో రాహుల్ (38 58 బంతుల్లో 3 ఫోర్లు), రోహిత్ (87; 101 బంతుల్లో10 ఫోర్లు, 3 సిక్సర్లు) కాసేపు ఆదుకున్నారు.
8⃣7⃣ runs
— BCCI (@BCCI) October 29, 2023
1⃣0⃣ fours
3⃣ sixes
Captain Rohit Sharma's gritty knock comes to an end ??#TeamIndia 165/5 after 37 overs.
Follow the match ▶️ https://t.co/etXYwuCQKP#CWC23 | #MenInBlue | #INDvENG pic.twitter.com/XQeYsMsgGf
ఆపై వీరిద్దరూ వెనుదిరగాక సూర్యకుమార్ యాదవ్(49) ఆ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. జడేజా(8), షమీ(1) త్వరగా ఔటైనా బుమ్రా సాయంతో 200 పరుగులు దాటించాడు. అనంతరం విల్లీ బౌలింగ్‌లో భారీ షాట్ కు ప్రయత్నించి సూర్య ఔట్ అవ్వడంతో భారత్ 229 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లాండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ 3 వికెట్లు తీసుకోగా.. క్రిస్ వోక్స్, అదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
?? India finish their innings on 2️⃣2️⃣9️⃣
— England Cricket (@englandcricket) October 29, 2023
A much-improved performance with the ball, now let's finish the job with the bat ? #EnglandCricket | #CWC23 pic.twitter.com/bZsR26Iza6
ALSO READ :- ODI World Cup 2023: ప్రమాదంలో ఇంగ్లాండ్ జట్టు.. మరో రెండు ఓడితే ఐసీసీ టోర్నీకి దూరం