మ్యాచ్ జరిగితే గెలవాలి.. అదే రద్దయితే డైరెక్ట్ ఫైనల్.. అందువల్ల, భారత క్రికెట్ అభిమానులు ఉదయం నుంచి వర్షం కోసం ప్రార్థనలు చేస్తుండగా.. ఆ విజ్ఞప్తిని వరుణ దేవుడు ఆలకించినట్టే ఉన్నారు. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డు పడుతున్నాడు. అరగంటకోసారి వచ్చి ఆటగాళ్లను, అభిమానులను, మ్యాచ్ రిఫరీలను పలకరిస్తున్నాడు.
ఉదయం నుంచి కుండపోత వర్షం కురవడంతో భారత్, ఇంగ్లండ్ మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న గయానా జలమయం అయ్యింది. ఇక స్టేడియమైతే.. వర్షపు నీటితో చెరువును తలపించింది. అయితే, మరో గంటలో ఆట ప్రారంభం కానుంది అనంగా కాసేపు ఎడతెరపనిచ్చాడు. దాంతో, ఆటగాళ్లు ప్రాక్టీస్ కోసం మైదానంలోకి రాగా.. మరోసారి వర్షం ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ప్రొవిడెన్స్ స్టేడియం(గయానా) చుట్టు ప్రక్కల పరిసరాల్లో భారీ వర్షం కురుస్తోంది. దాంతో, మైదానాన్ని అంతటిని కవర్లతో కప్పి ఉంచారు.
TOSS HAS BEEN DELAYED IN SEMI-FINAL...!!!! pic.twitter.com/jXPLQssTbb
— Johns. (@CricCrazyJohns) June 27, 2024
రద్దయితే ఫైనల్‌కు టీమిండియా
ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే కూడా లేనందున, వర్షం వల్ల ఆట సాధ్యం కాకపోతే సూపర్-8 దశలో మెరుగైన స్థితిలో ఉన్న భారత జట్టు ఫైనల్ చేరుతుంది. అయితే, ఈ మ్యాచ్‌కు 250 నిమిషాల అదనపు సమయం ఉండటం గమనార్హం. 10 ఓవర్ల ఆట నిర్వహించేందుకు తెల్లవారుజామున 1:50 గంటల వరకు సమయముంది. దాంతో, రిఫరీలు అప్పటిదాకా వేచి చూస్తారు. అప్పటికీ ఆట సాధ్యం కాకుంటే ఇంగ్లండ్ పని అయిపోయినట్టే. డిఫెండింగ్ చాంపియన్ బట్లర్ సేన ఇంటి దారి పడుతుంది. భారత జట్టు ఫైనల్లో అడుగు పెడుతుంది.