భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగనున్న రెండో సెమీఫైనల్ మరి కాసేపట్లో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి మ్యాచ్ జరగాల్సిన గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం పరిసరాల్లో ఎలాంటి వర్షం లేదు. సూర్యుడు కూడా దర్శనమిచ్చాడు. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలోకి వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారు.
అంపైర్లు 8.45 గంటలకు మైదానాన్ని, పిచ్‌ను పరిశీలించనున్నారు. మొదట 8:30 గంటలకు పిచ్ పరిశీలించనున్నట్లు అంపైర్లు వెల్లడించినా.. అనంతరం ఆ సమయాన్ని మరో 15 నిమిషాలు పొడిగించారు. టాస్, ఆట ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై అప్పుడే నిర్ణయం తీసుకోనున్నారు.
The sun is out and the covers are being removed! 🙌
— ESPNcricinfo (@ESPNcricinfo) June 27, 2024
Another inspection will take place at 11:15am local - 30 minutes from nowhttps://t.co/I5LtGLJ8YB | #INDvENG | #T20WorldCup pic.twitter.com/zD1TBC1HUC