హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఇండియా, ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ చూడటానికి వేలాది మంది క్రికెట్ అభిమానులు తరలివచ్చారు. వీకెండ్ కావటంతో స్టేడియం దాదాపు ఫుల్ అయ్యింది. మ్యాచ్ టికెట్ రేట్లు కూడా తక్కువగా ఉండటంతో.. గ్రౌండ్ లో మ్యాచ్ చూసేందుకు భారీ హాజరయ్యారు ప్రేక్షకులు. మ్యాచ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు కానీ.. ఫుడ్ రేట్లు చూసి గుండెలు బాదుకుంటున్నారు క్రికెట్ అభిమానులు. బయట నుంచి ఫుడ్ తీసుకెళ్లటం నిషేధం.. ఏం తినాలన్నా.. ఏం తాగాలన్నా స్టేడియంలోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఫుడ్ ధరలు చూసి బెంబేలెత్తుతున్నారు క్రికెట్ అభిమానులు..
ఉప్పల్ స్టేడియంలో ఫుడ్ రేట్లు ఇలా ఉన్నాయి..
>>> వెజ్ పఫ్ లేదా ఎగ్ పఫ్ చిన్నది 30 రూపాయలు
>>> చిన్న సమోసా.. మనం రెగ్యులర్ గా బయట తినేది 15 రూపాయలు ( రోడ్ల పక్కన ఇది 5 రూపాయలు)
>>> పెద్ద సమోసా ఒక్కటి 30 రూపాయలు
>>> గ్లాస్ కోక్.. 60 రూపాయలు ( 250 ఎం.ఎల్ )
>>> సింగిల్ బిర్యానీ 150 రూపాయలు..
( క్వాంటిటీ విషయానికి వస్తే.. బయట సింగిల్ బిర్యానీలో సగం ఉంది.. చాలా చిన్న చిన్న ముక్కలు రెండు ఉన్నాయి )
>>> వెజ్ లేదా నాన్ వెజ్ ప్రాంకీ 120 రూపాయలు
>>> పాప్ కార్న్ డబ్బా 100 రూపాయలు (చిన్నది )
మరి వాటర్ బాటిల్ సంగతి ఏంటీ అంటారా.. అదొక్కటే ఫ్రీ.. అది కూడా బయట మార్కెట్ లో 5 రూపాయలు వాటర్ బాటిల్.. ఇది కూడా అందరికీ ఫ్రీగా ఇవ్వటం లేదు.. ఏదైనా ఫుడ్ ఐటమ్ కొనుగోలు చేస్తేనే ఇస్తున్నారు. మ్యాచ్ టికెట్ రేట్లు తక్కువగా ఉన్నాయని.. ఎగబడి వెళ్లిన క్రికెట్ అభిమానులు.. ఫుడ్ రేట్లు చూసి కళ్లు తేలేస్తున్నారు.