చెన్నై : టీ20 ఫార్మాట్‌లో దుమ్మురేపుతున్న టీమిండియా యంగ్‌స్టర్ తిలక్ వర్మను టెస్టుల్లోకి కూడా తీసుకోవాలని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సూచించాడు. ఇంగ్లండ్‌తో రెండో టీ20లో అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించిన తిలక్‌పై రాయుడు ప్రశంసల వర్షం కురిపించాడు. ‘తిలక్ సూపర్ స్టార్ క్రికెటర్. ఇండియా తరఫున అతను నాలుగు అసాధారణ ఇన్నింగ్స్‌లు ఆడాడు.
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అయినప్పటి తనపై ఉంచ నమ్మకానికి హైదరాబాద్ కుర్రాడు పూర్తి ప్రతిఫలం ఇస్తున్నాడు. తిలక్ అన్ని ఫార్మాట్ల ప్లేయర్ అవ్వగలడు. అతనికి టెస్టుల్లోనూ అవకాశం ఇవ్వాలి’ అని రాయుడు అభిప్రాయపడ్డాడు.