IND vs ENG: ఇండియా - ఇంగ్లండ్ టీ20 మ్యాచ్.. చెన్నై అభిమానులకు బంపర్ ఆఫర్

IND vs ENG: ఇండియా - ఇంగ్లండ్ టీ20 మ్యాచ్.. చెన్నై అభిమానులకు బంపర్ ఆఫర్

చెన్నైలో మ్యాచ్ అంటే.. ఏ స్థాయిలో అభిమానులు తరలి వస్తారో ఊహించగలం. ఐపీఎల్, వన్డే, టెస్ట్, టీ20.. ఏ మ్యాచ్ జరిగినా ప్రేక్షకులు పోటెత్తుతారు. ఆఖరికి దేశవాళీ మ్యాచ్ అన్నా తండోపతండాలుగా తరలి వస్తారు. ఈ అభిమానాన్ని దృష్టిలో ఉంచుకొని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్(Tamil Nadu Cricket Association) ఆ రాష్ట్ర ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పింది. 

శనివారం(జనవరి 25) ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగనున్న రెండో టీ20 మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వచ్చే అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం కల్పించనున్నట్లు ప్రకటించింది. టికెట్లు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. 

ALSO READ | Champions Trophy 2025: ముందుగానే పాకిస్థాన్‌కు న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లు.. కారణమిదే!

"మ్యాచ్ టికెట్లు కలిగిన ప్రేక్షకులు మెట్రో రైళ్లలో శనివారం ఉచితంగా ప్రయాణాలు చేయొచ్చు. అందుకు తగ్గటుగా మీ ప్రయాణాన్ని తెలివిగా ప్లాన్ చేసుకోండి.." అని TNCA సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడమే లక్ష్యంగా కాంప్లిమెంటరీ మెట్రో ప్రయాణాన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

భారత్ vs ఇంగ్లాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్

  • జనవరి 22: తొలి టీ20 (కోల్ కతా)
  • జనవరి 25: రెండో టీ20 (చెన్నై)
  • జనవరి 28: మూడో టీ20 (రాజ్ కోట్)
  • జనవరి 31: నాలుగో టీ20 (పుణె)
  • ఫిబ్రవరి 2: ఐదో టీ20 (ముంబై)