ఇండియా, ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతోన్న తొలి టీ20కి వర్షం అంతరాయం కలిగిస్తోంది. దీంతో ఆటను నిలిపివేసిన అంపైర్లు.. మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ప్రస్తుతానికి టీమిండియా స్కోర్.. 6.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 47 పరుగులుగా ఉంది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం.. కేవలం రెండు పరుగుల ముందుంజలో ఉంది.
140 పరుగుల లక్ష్య చేధనకు దిగిన భారత్‌కు మంచి శుభారంభం లభించినప్పటికీ.. వరుస బంతుల్లో వికెట్లు కోల్పోవడం దెబ్బ కొట్టింది. యశస్వి జైస్వాల్(24), రుతురాజ్ గైక్వాడ్(19 నాటౌట్) జోడి తొలి వికెట్‌కు 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే వర్షం ఆటంకం కలిగించడానికి రెండు బంతుల ముందు.. టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. క్రెయిగ్ యంగ్ బౌలింగ్ జైస్వాల్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరగా.. ఆ తరువుత బంతికే తిలక్ వర్మ డకౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు.
Rain stopped play...!!!!
— Johns. (@CricCrazyJohns) August 18, 2023
India ahead by just 2 runs according to DLS. pic.twitter.com/nttg7CZkTP
డక్‌వర్త్ లూయిస్ ప్రకారం.. టీమిండియా రెండు పరుగుల ముందుంజలో ఉన్నా.. వర్షం ఆగాక సమీకరణాలు ఒక్కసారిగా మారిపోవచ్చు. మరోసారి వర్షం ముప్పు పొంచిఉండటంతో వేగంగా ఆడాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో మరో వికెట్ కోల్పోతే.. మ్యాచ్ చేజారే అవకాశం లేకపోలేదు. దీంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.