IND vs IRE: చేతులెత్తేసిన ఐరిష్ బ్యాటర్లు.. టీమిండియా టార్గెట్ 97

IND vs IRE: చేతులెత్తేసిన ఐరిష్ బ్యాటర్లు.. టీమిండియా టార్గెట్ 97

టీ20 ప్రపంచక‌ప్ తొలి మ్యాచ్‌లో భార‌త పేస‌ర్లు విజృంభించారు. హార్దిక్ పాండ్యా(3/27), జ‌స్ప్రీత్ బుమ్రా(2/6), అర్ష్‌దీప్ సింగ్(2/35)లు చెలరేగడంతో ఐర్లాండ్ 96 ప‌రుగుల‌కే కుప్పకూలింది. ఐరిష్ బ్యాటర్లలో గారెత్ డెలానీ(14 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్ లు) మినహా ఏ ఒక్కరూ 20 పరుగులను దాటలేకపోయారు. చేసిన 96 పరుగుల్లోనూ ఎక్సట్రాల రూపంలో వచ్చినవి15.

పిచ్ బ్యాటర్లకు సహకరించకపోవడంతో ఐరిష్ బ్యాటర్ల వద్ద సమాధానమే లేకపోయింది. బంతి ఆగి రావడం, అనూహ్యమైన బౌన్స్‌తో తెగ ఇబ్బంది పడ్డారు. ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్(2), అండ్రూ బ‌ల్బిరినీ(5)లను లెఫ్ట్ ఆర్మ్ పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్ ఒకే ఓవ‌ర్లో పెవిలియన్ చేర్చాడు. మూడో ఓవర్ తొలి బంతికి డేంజ‌ర‌స్ పాల్ స్టిర్లింగ్(2)ను వెన‌క్కి పంపిన అర్ష్‌దీప్.. అదే ఓవర్ ఆఖ‌రి బంతికి అండ్రూ బ‌ల్బిరినీ(5)ని బౌల్డ్ చేశాడు. దాంతో, రెండు ప‌రుగుల వ్యవ‌ధిలో ఐర్లాండ్ ఓపెన‌ర్లు పెవిలియ‌న్ చేరారు. అనంతరం వచ్చిన బ్యాటర్లు నిలదొక్కుకోలేకపోయారు.

 
హార్దిక్ పాండ్య వేసిన ఏడో ఓవర్ లో టక్కర్ (10) ఔట్ అవ్వగా.. ఆ మరుసటి ఓవర్‌లోనే బుమ్రా టెక్టార్ (4) ఔట్ చేశాడు. వెంటవెంటనే క్యాంఫర్ (12), డాక్రెల్ (3) కూడా ఔట్ అవ్వడంతో ఐర్లాండ్ ఇన్నింగ్స్ కుప్పకూలక తప్పలేదు. చివరలో డెలానీ (26), జోష్‌ లిటిల్ (14) పోరాడడంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగారు. 16 ఓవర్లలో 96 పరుగులు వద్ద ఐర్లాండ్ ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 3, జ‌స్ప్రీత్ బుమ్రా 2, అర్ష్‌దీప్ సింగ్ 2, అక్షర్ పటేల్ 1, మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు.