IND vs IRE: సహకరించని పిచ్.. పెవిలియన్‌కు క్యూ కడుతోన్న ఐరిష్ బ్యాటర్లు

IND vs IRE: సహకరించని పిచ్.. పెవిలియన్‌కు క్యూ కడుతోన్న ఐరిష్ బ్యాటర్లు

న్యూయార్క్ వేదికగా భారత్, ఐర్లాండ్ మధ్య జరుగుతోన్న మ్యాచ్ నత్తనడకన సాగుతోంది. పిచ్ బ్యాటర్లకు సహకరించడం లేదు. బంతి ఆగి రావడం, అనూహ్యమైన బౌన్స్‌తో ఇబ్బంది పెడుతోంది. దీంతో ఐరిష్ బ్యాటర్లు పరుగులు చేయడానికి నానా అవస్థలు పడుతున్నారు. టెస్ట్ మ్యాచ్ తరహాలో పరుగులు వస్తున్నాయి. పది ఓవర్లలోపే ఐర్లాండ్ 6 వికెట్లు కోల్పోయి పోరాడుతోంది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐరిష్ ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్(2), అండ్రూ బ‌ల్బిరినీ(5) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు. లెఫ్ట్ ఆర్మ్ పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్ ఒకే ఓవ‌ర్లో వీరిద్దరిని పెవిలియన్ చేర్చాడు. తొలి బంతికి డేంజ‌ర‌స్ పాల్ స్టిర్లింగ్(2)ను వెన‌క్కి పంపిన అర్ష్‌దీప్.. అదే ఓవర్ ఆఖ‌రి బంతికి అండ్రూ బ‌ల్బిరినీ(5)ని బౌల్డ్ చేశాడు. దాంతో, రెండు ప‌రుగుల వ్యవ‌ధిలో ఐర్లాండ్ ఓపెన‌ర్లు పెవిలియ‌న్ చేరారు. అనంతరం వచ్చిన బ్యాటర్లు నిలదొక్కుకోలేకపోతున్నారు. 

బుమ్రా వేసిన ఆరో ఓవర్ మెయిడిన్ కాగా.. హార్దిక్ పాండ్య వేసిన ఏడో ఓవర్ లో టక్కర్ (10) ఔట్ అయ్యాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే బుమ్రా టెక్టార్ (4) ఔట్ చేసి ఐర్లాండ్ ను మరింత కష్టాల్లోకి నెట్టాడు. వెంటవెంటనే క్యాంఫర్ (12), డాక్రెల్ (3) కూడా ఔట్ అవ్వడంతో ఐర్లాండ్ ఇన్నింగ్స్ వందలోపే ముగిసేలా కనిపిస్తోంది. ప్రస్తుతం స్కోర్.. 10 ఓవర్లు ముగిసేసరికి 49/6. డెలానీ (0), అడైర్ (3) క్రీజులో ఉన్నారు.