IND vs IRE: టాస్ గెలిచిన టీమిండియా.. ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ

IND vs IRE: టాస్ గెలిచిన టీమిండియా.. ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ

టీమిండియా పొట్టి ప్రపంచక‌ప్‌ తొలి పోరుకు సమయం ఆసన్నమైంది. రోహిత్ సేన బుధవారం(జూన్ 05).. సంచ‌ల‌న విజ‌యాల‌కు కేరాఫ్ అయిన ఐర్లాండ్‌తో తలపడుతోంది. న్యూయార్క్‌ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో భారత జట్టు సారథి రోహిత్ శర్మ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ ఎలా సహకరిస్తుందనే దానిపై క్లారిటీ లేకపోవడంతో హిట్‌మ్యాన్ బౌలింగ్ వైపు మొగ్గు చూపాడు.

యశస్వి జైస్వాల్ బెంచ్‌కు పరిమితమవ్వడంతో విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా రానున్నాడు. మరో ఇద్దరు కుల్దీప్, సంజు శాంసన్ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. నలుగురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగుతోంది.

తుది జట్లు

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.

ఐర్లాండ్: ఆండీ బాల్బిర్నీ, పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), లోర్కాన్ టక్కర్(వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, బెంజమిన్ వైట్, జోష్ లిటిల్.