నేపాల్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. బుమ్రా స్వదేశానికి తిరిగి రావడంతో అతని స్థానంలో.. షమీని జట్టులోకి తీసుకున్నారు.
కాగా, ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ఇరు జట్లకు కీలకం.. ఓటమి పాలైన వారు టోర్నీ నుండి నిష్క్రమించాల్సిందే. ఈ టోర్నీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ ఓటమిపాలైతే.. వర్షం కారణంగా భారత్- పాక్ మ్యాచ్ రద్దయ్యింది. ప్రస్తుతం పల్లెకిలేలో పొడి వాతావరణం కనిపిస్తున్నప్పటికీ దట్టమైన మేఘాలు అలుముకొని ఉన్నాయి. ఏక్షణమైనా వర్షం రావొచ్చని రిపోర్ట్స్ ఉన్నాయి.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
నేపాల్: కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్(వికెట్ కీపర్), రోహిత్ పౌడెల్(కెప్టెన్), భీమ్ షర్కి, సోంపాల్ కమీ, గుల్సన్ ఝా, దీపేంద్ర సింగ్ ఐరీ, కుశాల్ మల్లా, సందీప్ లామిచానే, కరణ్ కెసి, లలిత్ రాజ్‌బన్షి.
Asia Cup 2023 | Match 5 | India vs Nepal
— Sri Lanka Cricket ?? (@OfficialSLC) September 4, 2023
Rohit Sharma won the toss and elected to field first.#AsiaCup2023 #INDvNEP pic.twitter.com/T2KpzQ0SaF