నేపాల్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పేలవ ఫీల్డింగ్ చేస్తున్నారు. తొలి ఐదు ఓవర్లలోనే మూడు క్యాచ్‌లు జారవిడిచారు. దీంతో నేపాల్ బ్యాటర్లు జోరు కనబరుస్తున్నారు. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ.. బౌండరీల వర్షం కురిపిస్తున్నారు.
మహమ్మద్ షమీ వేసిన తొలి ఓవర్ చివరి బంతికి భుర్టెల్ ఇచ్చిన క్యాచ్‌ను.. శ్రేయాస్ అయ్యర్ జారవిడచగా, ఆ మరుసటి ఓవర్ తొలి బంతికే ఆసిఫ్ షేక్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను విరాట్ కోహ్లీ నేలపాలు చేశాడు. దీంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. అసహనం వ్యక్తం చేశాడు. అంత ఈజీ క్యాచ్ వదిలేస్తావా..! అన్నట్లు ఎక్సప్రెషన్ ఇచ్చాడు.
Virat Kohli Drop Catch Video#IndvsNep #AsiaCup2023 pic.twitter.com/l4d7cQuyaW
— FC Mobile (@Ismailzawar22Fc) September 4, 2023
అనంతరం ఇదో ఓవర్‌లో భుర్టెల్ ఇచ్చిన మరో ఈజీ క్యాచ్ ను కీపర్ ఇషాన్ కిషన్ వదిలేశాడు. దీంతో టీమిండియా పేలవ ఫీల్డింగ్‌పై నెట్టింట పెద్ద రచ్చ జరుగుతోంది. అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రాక్టీస్ మ్యాచ్ కాదని.. ఓటమి కోట్లాది మంది అభిమానులను బాధపెడుతుందన్న విషయం మరవకూడదని బుద్ధి చెప్తున్నారు.
Two Easy catch drop by virat and shreyash #virat #Kohli #shreyash #asiscup @cricbuzz #Bcci pic.twitter.com/AaOoAaBbs4
— divy saxena (@okkdivyy) September 4, 2023
తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి నేపాల్ వికెట్ నష్టపోకుండా.. 53 పరుగులు చేసింది. కుశాల్ భుర్టెల్(29), ఆసిఫ్ షేక్(20) క్రీజులో ఉన్నారు.