IND vs NZ: రోహిత్ ఒక్కడే 10.. టాస్‌లలో టీమిండియా నయా రికార్డు

IND vs NZ: రోహిత్ ఒక్కడే 10.. టాస్‌లలో టీమిండియా నయా రికార్డు

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం(మార్చి 3) న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా మరోసారి టాస్ ఓడిపోయింది. దాంతో, వరుసగా 13 సార్లు టాస్ ఓడిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. బహుశా..! భవిష్యత్తులోనూ ఈ రికార్డు చెక్కుచెదరక పోవచ్చని విశ్లేషకుల మాట.

రోహిత్ ఒక్కడే 10 టాస్‌లలో.. 

భారత జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ టాస్ ఓడిపోవడం ఇది 10వ సారి. దాంతో, వరుసగా అత్యధిక టాస్‌లు ఓడిన కెప్టెన్ల జాబితాలో హిట్ మ్యాన్ మూడవ స్థానంలో నిలిచారు. రోహిత్ కంటే ముందు బ్రియాన్ లారా (12సార్లు), పీటర్ బోరెన్ (11సార్లు) ఒకడుగు ముందున్నారు. 

వరుసగా అత్యధిక టాస్‌లు ఓడిన కెప్టెన్లు:

  • 1. బ్రియాన్ లారా: 12 (31 అక్టోబర్ 1998 - 21 మే 1999)
  • 2. పీటర్ బోరెన్: 11 (18 మార్చి 2011 - 27 ఆగస్టు 2013 వరకు)
  • 3. రోహిత్ శర్మ: 10* (19 నవంబర్ 2023 - 2 మార్చి 2025 వరకు)
  • 4. జోస్ బట్లర్: 9 (27 జనవరి 2023 - 13 సెప్టెంబర్ 2023 వరకు)
  • 5. మోనాంక్ పటేల్: 9 (29 మే 2022 - 13 ఆగస్టు 2022 వరకు)
  • 6. ఇయాన్ మోర్గాన్: 9 (22 జనవరి 2017 - 29 మే 2017 వరకు)
  • 7. నాజర్ హుస్సేన్: 9 (24 అక్టోబర్ 2000 - 22 జనవరి 2002 వరకు)