భారత యువ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుటపెట్టి ఐదేళ్లు కూడా పూర్తి చేసుకోని ఈ యువ క్రికెటర్.. ఒక్కొక్కటిగా దిగ్గజ క్రికెటర్ల జ్ఞాపకాలన్నీ కొల్లగొడుతున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గిల్.. మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 2 వేల పరుగులు పూర్తి చేసిన జాబితాలో గిల్ అగ్రస్థానంలో నిలిచాడు. గతంలో ఈ రికార్డు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హషీమ్ ఆమ్లా పేరిట ఉండేది. గిల్ దాన్ని అధిగమించాడు. వన్డేల్లో రెండు వేల పరుగులు చేరుకునేందుకు గిల్‌కు 38 ఇన్నింగ్స్‌లు అవసరం పడగా.. ఆమ్లా 40 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.
Also Read : ODI World Cup 2023: అభిమానులను క్షమాపణ కోరిన డివిలియర్స్.. కారణమిదే?
వన్డేల్లో వేగంగా 2000 పరుగులు చేసిన ఆటగాళ్లు
- శుభ్‌మాన్ గిల్: 38 ఇన్నింగ్స్‌లు
- హషీమ్ ఆమ్లా: 40 ఇన్నింగ్స్‌లు
- జహీర్ అబ్బాస్: 45 ఇన్నింగ్స్‌లు
- కెవిన్ పీటర్సన్: 45 ఇన్నింగ్స్‌లు
- బాబర్ ఆజం: 45 ఇన్నింగ్స్‌లు
- రాస్సీ వాన్ డెర్ డస్సెన్: 45 ఇన్నింగ్స్‌లు
అలాగే, ఈ మ్యాచ్‌కు ముందు వన్డేల్లో వేగంగా 2000 పరుగులు చేసిన భారత ఆటగాళ్ల రికార్డు భారత వెటరన్ క్రికెటర్ శిఖర్ ధావన్ పేరిటఉండేది. గిల్ దాన్ని అధిగమించాడు.
వన్డేల్లో వేగంగా 2000 పరుగులు చేసిన భారత ఆటగాళ్లు
- శుభ్‌మాన్ గిల్: 38 ఇన్నింగ్స్‌లు
- శిఖర్ ధావన్: 49 ఇన్నింగ్స్‌లు
- నవజ్యోత్ సింగ్ సిద్ధూ: 52 ఇన్నింగ్స్‌లు
- సౌరవ్ గంగూలీ: 52 ఇన్నింగ్స్‌లు
- విరాట్ కోహ్లి: 53 ఇన్నింగ్స్‌లు
Fastest to 2⃣0⃣0⃣0⃣ runs in Men's ODIs! ?
— BCCI (@BCCI) October 22, 2023
Congratulations Shubman Gill ?? #TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/meRzFIuV0y