వన్డే ప్రపంచ కప్ 2023లో భారత జట్టు వరుసగా పదో విజయాన్ని అందుకొని.. ఫైనల్‌లో అడుగుపెట్టింది. కప్ కొట్టేందుకు ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది. బుధవారం వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ పోరులో బ్యాటింగ్‌లో కోహ్లీ, అయ్యర్.. బౌలింగ్‌లో షమీ వీరోచితంగా పోరాడారు.
బ్యాటింగ్‌లో అందరూ రాణించినా.. బౌలింగ్‌లో మాత్రం షమీ వీరోచితంగా పోరాడాడు. ఒకానొక సమయంలో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(69), డారిల్ మిచెల్(134) మ్యాచ్‌ను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేసినా.. షమీ వారిని దెబ్బకొట్టాడు. ఒకే ఓవర్‌లో కేన్ విలియమ్సన్ (69), టామ్ లాథమ్ (0)ను ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. ఆపై కూడా కట్టుదిట్టమైన బంతులేస్తూ న్యూజిలాండ్ బ్యాటర్లను పెవిలియన్ దారి పట్టించాడు. నిజంగా ఇది షమీ షో అని చెప్పాల్సిందే.
????? ?????!
— BCCI (@BCCI) November 15, 2023
How good has Mohd. Shami been today ?#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/YP4vDh5DFm
ఓ వైపు సిరాజ్ పరుగులు భారీగా ఇస్తున్నా.. షమీ మాత్రం తన వంతుగా కంట్రోల్ చేస్తూనే వచ్చాడు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ భారత శిబిరంలో ఆనందం నింపాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో 9.5 ఓవర్లు వేసిన షమీ 57 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. షమీ ప్రదర్శనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
The star of the night - Mohd. Shami bags the Player of the Match Award for his incredible seven-wicket haul ?
— BCCI (@BCCI) November 15, 2023
Scorecard ▶️ https://t.co/FnuIu53xGu#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/KEMLb8a7u6