కేన్ విలియంసన్, డారిల్ మిచెల్ 181 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. షమీ ఓ అద్భుత బంతితో ఈ జోడీని విడగొట్టాడు. దీంతో 220 పరుగుల వద్ద న్యూజిలాండ్ విలియంసన్(69) రూపంలో మూడో వికెట్ కోల్పోయింది.ఈ మ్యాచ్ లో రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న కివీస్ కెప్టెన్ ఎట్టలకే షమీ బౌలింగ్ లో ఔటయ్యాడు. మిడ్ వికెట్ బౌండరీ వద్ద సూర్య కుమార్ యాదవ్ క్యాచ్ పట్టడంతో భారత అభిమానులు ఊపిరికి పీల్చుకున్నారు.
రెండో బంతికి వికెట్ తీసుకున్న షమీ.. ఇదే ఊపులో నాలుగో బంతికి వికెట్ కీపర్ టామ్ లేతమ్ ను ఎల్ బీ డబ్ల్యూ గా వెనక్కి పంపాడు. విలియంసన్ ఇచ్చిన ఒక సింపుల్ క్యాచ్ ను షమీ మిస్ చేసినా వికెట్ తీసుకొని కేన్ ను పెవిలియన్ కు పంపాడు. ప్రస్తుతం న్యూజి లాండ్ 34 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ప్రస్తుతం డారిల్ మిచెల్ (101), ఫిలిప్స్ (0) క్రీజ్ లో ఉన్నారు. కివీస్ గెలవాలంటే మరో 16 ఓవర్లలో 177 పరుగులు చేయాలి.
TWO WICKETS IN AN OVER FOR SHAMI....!!!!
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 15, 2023
HE'S SIMPLY UNSTOPPABLE...!!! pic.twitter.com/KhjhDNMXTV