మనుషులకు ఉన్న ఒక చెడు లక్షణమేంటో తెలుసా..? ఎదుటి వాటిని తిట్టాలనుకున్నప్పుడు ఎలా అయినా తిడతారు. అతని వల్ల మంచి జరిగినా.. అందులో కూడా తప్పులు వెతుకుతారు. కాదంటే తుది జట్టులో స్థానమిచ్చి.. ఐదు వికెట్లు తీసేలా ప్రోత్సహించిన కెప్టెన్‌ను ఇన్నేసి మాటలంటారా!
ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత పేసర్ మహ్మద్ షమీ ఐదు వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో తను వేసిన మొట్టమొదటి బంతికే వికెట్ తీశాడు. ఫామ్ లో కివీస్ ఓపెనర్ విల్ యంగ్(17)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆపై రచిన్ రవీంద్ర(75), డారిల్ మిచెల్(135) ను ఔట్ చేసి కివీస్ ను భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశాడు. ఈ క్రమంలో షమీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచ కప్‌లలో భారత జట్టు తరపున అత్యధిక వికెట్లు(32) తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నాడు.
SHAMI THE STAR IN WORLD CUPS.....!!!! pic.twitter.com/YwlnmCrytg
— Johns. (@CricCrazyJohns) October 22, 2023
హిట్ మ్యాన్‌పై విమర్శలు
ఈ మెగా టోర్నీలో షమీకి ఇదే మొదటి మ్యాచ్. రాక రాక వచ్చిన అవకాశాన్ని షమీ రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. అదే రోహిత్ కు తలనొప్పిగా మారుతోంది. గత మ్యాచ్ ల్లో అతనికి ఎందుకు అవకాశం ఇవ్వలేదనివిమర్శకులు రోహిత్ ను ప్రశ్నిస్తున్నారు. మొదటి నాలుగు మ్యాచ్‌లకు అతన్ని ఎందుకు కూర్చోపెట్టారో చెప్పాలని పట్టుబడుతున్నారు. అలాగే, శార్దూల్ ఠాకూర్‌ను ఉద్దేసిస్తూ.. జట్టులో అతడెందుకో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
First game of the tournament for him and Mohd. Shami receives the Player of the Match award for his outstanding five-wicket haul in Dharamsala ??
— BCCI (@BCCI) October 22, 2023
Scorecard ▶️ https://t.co/Ua4oDBM9rn#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/21kegb4VB0